సీమాంధ్రులపైనే టీ పార్టీల ఆశలు

Fri Nov 02 2018 14:04:46 GMT+0530 (IST)

తెలంగాణాలో సీమాంధ్రుల ఓటింగ్ బలంగా ఉంది. వారు ఏ పార్టీకి ఒటేస్తే ఆ పార్టీ గెలుపు ఖాయంలో అన్ని జిల్లాలో విస్తరించి ఉన్నారు. గత గ్రేటర్ హైదరాబాద్ మినహా - మిగతా అన్ని జిల్లాల్లో సీమాంధ్రులు టీడీపీ-బీజేపీ కూటమి వైపు గడిచిన 2014 ఎన్నికల్లో మొగ్గు చూపారు. ఆ తరువాత చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరిపోయారు.సీమాంధ్రులు ఆంధ్ర వాళ్లలా కాకుండా తెలంగాణ ప్రజానీకంలా ఆలోచించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తి - ఓటింగ్ పై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో వేచిచూడాలి. ఇటీవల సీమాంధ్రుల సమావేశంలో పలువురు కేటీఆర్ ను నిలదీశారు. కేసీఆర్ సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో టీఆర్ ఎస్ కు సీమాంధ్రుల ఓట్లు పూర్తిస్థాయిలో పడవని అర్థమైంది. తెలంగాణలోని 30 నుంచి 35 స్థానాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో సీమాంధ్రులు ఉన్నారు. ఈ క్రమంలో మహా కూటమి వీరి ఓటింగ్ పై గట్టి నమ్మకం పెట్టుకుంది.

హైదరాబాద్ - నల్గొండ - రంగారెడ్డి - ఖమ్మం - నిజామాజాద్ జిల్లాల్లో సీమాంధ్రులు విస్తరించి ఉన్నారు.  రాబోయే ఎన్నికల్లో వీరంతా కేసీఆర్  పిలుపునకు స్పందిస్తారా లేదా అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు కూటమి కూడా వీరి ఓట్లపైనే గంపెడాశలు పెట్టుకుంది. వీరితో పాటు బీహార్ - ఒడిసా - ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు చాలామంది తెలంగాణాలో స్థిరపడిపోయి ఉన్నారు. వీరి ఓటు ఎటు పడుతుందోనని అన్ని పార్టీలు లెక్కలు వేసుకునే పని పడిపోయాయి.