Begin typing your search above and press return to search.

బాబు బామ్మర్ధా మజాకా.. టికెట్ ఖాయం

By:  Tupaki Desk   |   12 Nov 2018 8:22 PM GMT
బాబు బామ్మర్ధా మజాకా.. టికెట్ ఖాయం
X
ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా..? ఇది ‘పోకిరీ’ సినిమాలో మహేష్ బాబు డైలాగ్.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఒక సీటును అలాగే ఇచ్చేసింది కాంగ్రెస్ అధిష్టానం.. చంద్రబాబు బామ్మర్ధి చెప్పాడని.. మారు మాట్లాడకుండా గప్ చుప్ గా కట్టబెట్టేసింది. ఆయన టీడీపీ వాది కాదు.. కొన్నేళ్లుగా తెలుగుదేశం జెండా మోసింది లేదు.. చంద్రబాబు బామ్మర్ధితో సినిమా తీశాడంతే.. ఆ పరిచయమే ఆయనకు టికెట్ ఇప్పించేసింది.

పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా జెండాలు మోసినోళ్లకు గుర్తింపు లేదని వర్ధమాన రాజకీయాల్లో ఎన్నోసారు నిరూపితమైంది. చాలా ఉదాహరణలున్నాయి. ఇప్పుడు పచ్చపార్టీలో కూడా అదే పునరావృతమైంది. రాజకీయాలు తెలియని.. అస్సలు రాజకీయాల్లో లేని ఓ తెలుగు నిర్మాతకు సీటును దగ్గరుండి మరీ ఇప్పించింది టీడీపీ పార్టీ... కేవలం పార్టీ అధినేత వద్ద ఫైరవీ చేసుకొని టికెట్లు పొందాడు ఆ నిర్మాత..

చంద్రబాబు బావమరిది.. ప్రస్తుత ప్రజాప్రతినిధితో సదురు నిర్మాత ఓ తెలుగు సినిమా తీశాడు. ఆ పరిచయం, స్నేహం తో ఇప్పుడు మహాకూటమి సీటు కొల్లగొట్టాడు. కూటమిలో ఒక్క సీటు కోసం తన్నుకు చస్తున్న నేతలందరికీ షాక్ ఇస్తూ ఏకంగా హైదరాబాద్ లోనే ఖరీదైన సీటును ఈజీగా కొల్లగొట్టేశాడు.. దీన్ని బట్టి సీటు కోసం కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం వద్దకో.. కాంగ్రెస్ తెలంగాణ పెద్దలనో కలిసే కన్నా బాబు వద్ద భజన చేసి.. ఆయన బామ్మర్ధిని కాస్త మచ్చిక చేసుకుంటే చాలు సీటు వచ్చేది కదా అని సీట్లు దక్కని కాంగ్రెస్ అభ్యర్థులు వాపోతున్నారు. మరి ఈ బాబు గారి అవాజ్య ప్రేమలోంచి సీటు పొందిన సదురు నిర్మాత పోటీచేసే స్థానంలో గెలుస్తాడా.? లేదా అన్నది వేచి చూడాల్సిందే..