Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు కొడుకులు అన్నం పెట్టలేదు..

By:  Tupaki Desk   |   21 Feb 2019 11:18 AM GMT
ఎన్టీఆర్ కు కొడుకులు అన్నం పెట్టలేదు..
X
మాజీ ముఖ్యమంత్రి, దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్ తో బతికున్నప్పుడు సాన్నిహిత్యంగా ఉన్న సీనియర్ పాత్రికేయులు తిప్పరాజు రమేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ జిల్లాకు నిమ్మకూరు సమీప గ్రామానికి చెందిన ఈయన ఎన్టీఆర్ కు సన్నిహితుడు. ఈ సందర్భంగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్ తో సంచలన విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ ఆస్తులు పంచుకున్న కుమారులు ఆయన ఆశయాలు పంచుకోలేదని..కనీసం ఆ ఆస్తులను కాపాడుకోలేని దుస్థితిలో ఆయన వారసులున్నారని రమేశ్ బాబు సంచలన కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ తదితరులు ఆస్తులు కూడబెట్టి కుమారులకు ఇస్తే.. వాళ్లు రెట్టింపు చేసి ఇంకా ధనవంతులయ్యారని..కానీ ఒక్క ఎన్టీఆర్ వారసులు మాత్రం వారసత్వాన్ని కొనసాగించలేక అప్పులపాలయ్యారని రమేష్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. చెన్నైలోని ఎన్టీఆర్ ఇంటిని కూడా కాపాడుకోలేక అమ్మేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. మిగతా సీనియర్ హీరోల వారసులు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని.. బాలక్రిష్ణ తప్పితే ఎన్టీఆర్ వారసులు ఎవరు? ఎక్కడున్నారో జనానికి ఏంత వరకు తెలుసో చెప్పాలని ఆయన అన్నారు.

ఇక బయోపిక్ లతో ఎన్టీఆర్ పరువును ఆయన కుమారుడు బాలక్రిష్ణ బజారున పడేస్తున్నాడని రమేశ్ బాబు కామెంట్ చేశారు. చంద్రబాబు ఎంత మోసం చేసినా.. టీడీపీని లాగేసినా.. సైకిల్ గుర్తు తీసుకున్నా.. గండిపేట ఎన్టీఆర్ ఆశ్రమాన్ని లాగేసినా.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని జనాలు అంతా అనుకుంటున్నా నోరు మెదపని బాలయ్యకు తండ్రి సినిమా తీయాలని ఎలా ఆలోచన వచ్చిందో కానీ అదంతా ఫేక్ అని అన్నారు. రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపించేదే అసలు వాస్తవమని రమేష్ బాబు సంచలన కామెంట్స్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో రామారావు గారిని పరువును నిలబెట్టే ప్రయత్నం వర్మ చేస్తున్నాడని రమేశ్ బాబు హాట్ కామెంట్స్ చేశాడు.

ఎన్టీఆర్ ను చివరి నిమిషంలో ఎవ్వరూ పట్టించుకోలేదని.. కనీసం ఒక్క పూట కూడా అన్నం పుట్టలేదని.. ఒక్క పూట ఎన్టీఆర్ కు అన్నం పెడితే ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకొని ఉండేవారు కాదని రమేష్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. కొడుకులను ఎంతో బాగా చూసుకున్న ఎన్టీఆర్ ను చివర్లో ఎవరూ పట్టించుకోలేదన్నారు. బసవతారకం చనిపోయాక కొడుకలందరూ కనీసం తండ్రికి ఒక్క పూట భోజనం పెట్టలేదని రమేశ్ బాబు ధ్వజమెత్తారు. ఆయన ఇంటర్వ్యూ పూర్తిపాఠాన్ని కింద చూడొచ్చు.