Begin typing your search above and press return to search.

1.1 కోట్ల మందిపై అమెరికా కొత్త కొరడా

By:  Tupaki Desk   |   22 Feb 2017 4:44 AM GMT
1.1 కోట్ల మందిపై అమెరికా కొత్త కొరడా
X
అగ్ర రాజ్యం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్నారని భావిస్తున్న 1.1కోట్ల మందిపై తాజాగా కొరడా విదిల్చింది. వారిని అమెరికా నుంచి తిరిగి పంపేందుకు నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన రెండు కఠిన ఉత్తర్వుల్ని జారీ చేయటం కొత్త కలకలంగా మారింది.

వలస చట్టాల్ని ఉల్లంఘించిన వారందరిపైనా చర్యలు తీసుకోవాలని అంతర్గత భద్రతా విబాగం (డీహెచ్ ఎస్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అక్రమ వలసదారులు అందరిని దేశం నుంచి తిప్పి పంపాలని.. డీహెచ్ ఎస్ కార్యదర్శి జాన్ కెల్లీ.. తాజాగా వలస అధికారులకు రెండు ఉత్తర్వులు జారీ చేసి.. వాటిని అమలు చేయాలని ఆదేశించారు. దీంతో.. అమెరికా వ్యాప్తంగా ఉంటున్న 1.1 కోట్ల అక్రమ వలసదారులకు కొత్త కష్టాలు ఎదురుకానున్నాయి.

అయితే.. దేశంలో అక్రమంగా వలస ఉంటున్న వారిలో పిలల్ని.. మరికొందరిని మినహాయించి.. మిగిలిన వారందరిని తిరిగి పంపించేయాలని.. ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని స్పష్టం చేస్తున్నారు. చట్టాల్ని ఉల్లంఘించిన వారిపైన చర్యలు తప్పవని తేల్చేస్తున్న అమెరికా అధికారులు అక్రమవలసదారులపై ఫోకస్ పెంచారు. దేశంలో ఉన్న అక్రమ వలసదారుల్ని గుర్తించి.. వారిని దేశం నుంచి పంపించేందుకు వీలుగా.. కస్టమ్స్.. బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీల్లో ఐదు వేల మందిని.. ఇమ్మిగ్రేషన్.. కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్లలోకి మరో పది వేల మందిని కొత్తగా తీసుకోవాలని భావిస్తున్నారు.

దీంతో.. అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరించటమే కాదు.. మరో ఆలోచన లేకుండా వారిని దేశం నుంచి పంపించేయటం ఖాయమంటున్నారు. దీంతో.. అమెరికాలోఅక్రమంగా ఉంటున్న 1.1కోట్ల మందికి కొత్త కష్టం ఎదురైనట్లేనని చెప్పొచ్చు. అంతేకాదు.. మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి సంబంధించిన చర్యల్ని వెంటనే తీసుకోవాలని కెల్లీ ఆదేశిస్తున్నారు. రాజుకు తగ్గట్లే అధికారులు పని చేస్తారు కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/