Begin typing your search above and press return to search.

రాజీవ్‌ను.. వాడేంటి? అంటే చంపేస్తా

By:  Tupaki Desk   |   21 Jun 2017 8:32 AM GMT
రాజీవ్‌ను.. వాడేంటి? అంటే చంపేస్తా
X
బ్యూటీషియ‌న్ శిరీష అనుమానాస్ప‌ద మృతి వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. తొలుత అనుమానాస్ప‌ద మృతిగా.. ఆపై ఆత్మ‌హ‌త్య‌గా చెప్పినప్ప‌టికీ.. తాజాగా సంచ‌ల‌న ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న‌టికి నిన్న పోలీసులు ఇచ్చిన రిమాండ్ నోట్ లో శిరీష లోదుస్తుల్లో మ‌ర‌క‌లు ఉన్న‌ట్లుగా పోలీసులు పేర్కొన్నారు. దీనిపై ఫోరెన్సిక్ రిపోర్ట్ వ‌చ్చిన త‌ర్వాత మ‌రింత స‌మాచారం అందుతుంద‌ని చెబుతున్నా.. కుకునూరు ఎస్ ఐ శిరీష‌పై అత్యాచారం జ‌రిపాడ‌న్న వాద‌న జోరందుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా శిరీష‌కు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒక మీడియా ఛాన‌ల్ లో ప్ర‌సార‌మైన ఈ క్లిప్ లో రాజీవ్ అంటే శిరీష‌కు ఎంత అభిమాన‌మ‌న్న విష‌యంతో పాటు.. తేజ‌స్విని విష‌యంలో ఆమె ఎంత ఆగ్ర‌హంగా ఉంద‌న్న విషయం అర్థ‌మ‌య్యేలా ఉంది.

అంతేకాదు.. రాజీవ్‌కు తేజ‌స్విని ఫోన్ చేయ‌కుండా ఉండేందుకు వార్నింగ్ ఇవ్వాలంటూ త‌న‌కు తెలిసిన వారితో ఆమె కోరింద‌న్న విష‌యం తాజా ఫోన్ సంభాష‌ణ ఆడియో క్లిప్ స్ప‌ష్టం అవుతోంది. శిరీష‌.. రాజీవ్‌ల‌కు వివాహేత‌ర సంబంధం ఉందంటూ పోలీసులు వెల్ల‌డించిన వాద‌న‌కు బ‌లం చేకూరేలా తాజా ఫోన్ క్లిప్ ఉండ‌టం గ‌మ‌నార్హం.

రాజీవ్‌కు ఫోన్ చేయ‌కుండా ఉండ‌టానికి తేజ‌స్వినికి వార్నింగ్ ఇచ్చేందుకు న‌వీన్ అనే అత‌డి సాయాన్ని శిరీష కోర‌టం స‌ద‌రు క్లిప్ లో ఉంది. మాట‌ల మ‌ధ్య‌లో రాజీవ్‌ను వాడు అన్న మాట‌ను న‌వీన్ అంటే.. వాడేంటిరా? అలా అంటే చంపేస్తా అంటూ శిరీష సీరియ‌స్ కావ‌టం క్లిప్ లో ఉండ‌టం గ‌మ‌నార్హం.

రాజీవ్ అంటే త‌న‌కెంత అభిమాన‌మ‌న్న విష‌యాన్ని శిరీష మాట‌ల్లో వినిపించింది. తేజ‌స్విని త‌మ జోలికి రాకుండా బెదిరించాల‌న్న విష‌యాన్ని ఆమె చెప్పినట్లుగా స‌మాచారం. తాజా ఆడియోక్లిప్ లో రాజీవ్‌.. శిరీషల మ‌ధ్య స‌న్నిహిత సంబంధం ఉంద‌న్న విష‌యం స్ప‌ష్టం కావ‌టంతో పాటు.. తేజ‌స్విని దూరంగా ఉంచటానికి ఆమె చాలానే ప్ర‌య‌త్నం చేసింద‌న్న విష‌యం అర్థ‌మ‌య్యేలా ఉంది. రానున్న రోజుల్లో ఈ ఉదంతానికి సంబంధించి మ‌రెన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో?



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/