Begin typing your search above and press return to search.

లెక్కల తెలంగాణ !

By:  Tupaki Desk   |   11 Sep 2018 9:30 AM GMT
లెక్కల తెలంగాణ !
X
ముందస్తుకు ముందు అన్నీ ముదిరిపోతున్నాయి. కోపాలు...అలకలు... హఠాత్ ప్రేమలు.... అనవసరపు ఆవేశాలు....ఇలా అన్నీ తెలంగాణ రణక్షేత్రంపైకి వస్తున్నాయి. ఇందులోనే ప్రతిపక్షాలు తమకు వచ్చే స్థానాలు... తాము వదులుకునే స్ధానాలపై ద్రష్టి పెడుతున్నాయి. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం మహాకుటామిగా ఏర్పాటు అయ్యేందుకు ప్రాధమికంగా అంగీకారం కుదురింది. ఈ మహాకూటమిలో కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - వామపక్షా పార్టీలు జత కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా పార్టీల మధ్య పొత్తు చర్చలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల నుంచి పోటి చేయాలన్నది నిర్ణయం కావాల్సి ఉంది. మహాకూటమి ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలు ఇకే గూటికిందికి వచ్చిన సీట్ల సర్దుబాటుపై మాత్రం పీటముడి పడేలా ఉంది. వంద సంవత్సారల చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ 90 స్థానాలు కావలంటోంది. ఈ స్థానాలలో తమకు మంచి పట్టు ఉందని కాంగ్రెస్ నాయకుల వాదన. ఇక కాంగ్రెస్‌ కు పోగా మిగిలిన 29 స్థానాలు మిగతా పార్టీలకు వదిలి వేయాలని జాతీయ పార్టీ భావన. అయితే తెలంగాణలో కార్యకర్తల బలం ఉందని తమది కూడా జాతీయ పార్టీయే అని తక్కువ స్థానాలు కెటాయిస్తే అంగీకరించేది లేదని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.

ఇక ఇటీవలే పుట్టిన తెలంగాణ జన సమితి కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబుడుతోంది. కంటి తుడుపు చర్యగా నాలుగు లేక ఐదు స్దానాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మాత్రం అంగీకరించమని వారంటున్నారు. తెలంగాణలో వామపక్ష పార్టీలకు కూడా అంతో ఇంతో బలం ఉంది. ఖమ్మం - వరంగల్ - అదిలాబాద్ - కరీంనగర్ జిల్లాలలో వామపక్ష పార్టీలకు కార్యకర్తల బలం ఉంది. దీంతో ఆ పార్టీలు కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాలే కోరుతున్నాయి. పెట్రోలు ధరల పెంపుకు నిరసనగా సోమవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా పోలిస్‌ స్టెషనే పొత్తు చర్చలకు వేదిక అయ్యింది. ఈ ఆందోళనలో భాగంగా అరెస్ట్‌ అయిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ చిక్కడపల్లి పోలిస్‌ స్టేషన్‌లో పొత్తులపై ప్రాధమిక చర్చలు జరిపారు. ఎవరు ఎన్ని స్థానాలు పోటి చేయాలి, ఎవరు ఎన్ని వదిలి వేయాలి అన్న అంశాలపై చర్చకు చిక్కడపల్లి పోలిస్‌ స్టేషన్ వేదిక అయింది. పొత్తులపై నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్ధానిక నాయకులకే బాధ్యతలు అప్పగించారు. దీంతో పొత్తు చర్చలు వేగంవంతం కానున్నాయి. ఇక బుధవారం నాడు కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంథీ హైదారబాద్ వస్తున్నారు. ఆయన సమక్షంలో ఇతర పార్టీలతో ప్రధమిక చర్చలు జరిగే అవకాశం ఉంది.