సౌదీ రోడ్లపై కార్లతో మహిళల సందడి

Sun Jun 24 2018 18:56:54 GMT+0530 (IST)


సౌదీ అరేబియా మహిళల కల నెరవేరింది. గతంలో సౌదీలో మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని నిషేధించారు. తాజాగా ఆ దేశ రాజు సల్మాన్ నిషేధం ఎత్తివేయడంతో మహిళలు వాహనాలతో రోడ్లమీదకు వస్తున్నారు. మహిళలు కార్లను డ్రైవ్ చేస్తూ.. కేరింతలు కొడుతూ అర్ధరాత్రి వేళ సందడి చేస్తున్నారు. కార్లకు బెలూన్లను కట్టి రోడ్లపై విహరిస్తున్నారు.దశాబ్ధాలుగా సౌదీలో మహిళలు డ్రైవింగ్ పై నిషేధం  అమలులో ఉంది. ఈ నిషేధం ఎత్తివేయాలని మహిళలు - హక్కుల కార్యకర్తలు దశాబ్ధాలుగా ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు వీరి కల నెరవేరింది.  ఈ నిషేధం ఆదివారంతో ముగిసింది. ప్రపంచంలోనే ఇన్నేళ్లుగా మహిళల డ్రైవింగ్ పై నిషేధం విధించిన ఏకైక దేశంగా సౌదీ అరేబియా ఇన్నాళ్లు ఉండేది. ఇప్పుడది తొలిగిపోవడంతో సౌదీ మహిళల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ముగ్గురు పిల్లల తల్లి - టీవీ యాంకర్ అయిన సమర్ తన సొంత కారులో తొలిసారిగా డ్రైవర్ సీట్లో కూర్చొని నడిపింది. తాను పుట్టిన ఊరిలో - తన కారులో అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తుంటే ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. మధ్య మధ్యలో ఆమె వాహనాన్ని పలువురు మహిళలు ఆపి శుభాకాంక్షలు చెప్పారు.