Begin typing your search above and press return to search.

షాక్ ఇవ్వాల‌నుకుంటే త‌లాక్ అందుకుంది

By:  Tupaki Desk   |   29 May 2016 4:10 AM GMT
షాక్ ఇవ్వాల‌నుకుంటే త‌లాక్ అందుకుంది
X
అధిక బ‌ర‌ువు నుంచి స్లిమ్‌గా మారిపోయి త‌న భ‌ర్త‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేయాల‌నుకుంది ఓ మ‌హిళ‌. అయితే భ‌ర్తే ఆమెకు షాక్ ఇస్తాడ‌ని ఊహించ‌లేక‌పోయింది. సౌదీ రాజ‌ధాని రియాద్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇపుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

రియాద్ కొద్దికాలం క్రితం వివాహం జ‌రిగిన ఓ జంట నివ‌సిస్తోంది. భార్య అధిక బ‌రువుతో ఉంద‌ని ఎప్పుడూ భర్త‌ అసంతృప్తితో ఉండేవాడు. త‌న భార్య స‌న్న‌గా, నాజుగ్గా ఉండ‌ట‌మంటే ఆయ‌న గారికి చాలా ఇష్టం. ఈ విష‌యం త‌రుచూ త‌న స్నేహితుల ద‌గ్గ‌ర కూడా చెబుతూ ఉంటాడ‌ట‌. భ‌ర్త ఆవేద‌న‌ను తెలుసుకున్న భార్య ఎలాగైనా స‌రే స‌న్న‌బ‌డాల‌ని నిర్ణ‌యించుకుని అందుకు త‌గ్గ ట్రీట్‌ మెంట్ తీసుకుంది. అమెరికాకు వెళ్లి స‌ర్జ‌రీ చేయించుకుని తిరిగి సౌదీ అరేబియాలోని త‌న నివాసానికి చేరుకుంది. ఇలా వ‌చ్చిన భార్య‌ను చూసి భ‌ర్త ఆశ్చ‌ర్య‌పోయాడు. చాలా సంబ‌ర‌ప‌డ్డాడు. అస‌లు సంగ‌తి తెలుసుకుని భార్య‌కు విడాకులు ఇచ్చేశాడు.

త‌న ఆప‌రేష‌న్ కోసం ఆ భార్య 80వేల రియాల్స్ ఖ‌ర్చు చేసింద‌ట‌. ఓ ఇల్లు కొందామ‌ని ఎప్ప‌టినుంచో ఆ డ‌బ్బును భ‌ర్త దాచుకున్నాడు. ఆ డ‌బ్బుతోనే స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని అస‌లు విష‌యం తెలియ‌డంతో ఆగ్ర‌హించిన ఆయ‌న భార్య‌కు విడాకులు ఇచ్చేశాడు.