లోకేష్ కు దిమ్మదిరిగి బొమ్మ కనపడింది..

Mon Feb 11 2019 16:12:39 GMT+0530 (IST)

చినబాబు ట్వీట్లతో రెచ్చిపోయాడు.  ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ ట్వీట్టర్ లో లబోదిబోమని గోల చేశాడు. అయితే లోకేష్ ట్వీట్లకు ప్రజల్లోని కొందరు ఘాటైన సమాధానాలతో దిమ్మదిరిగేలా కౌంటర్లు ఇవ్వడం సంచలనంగా మారింది.ప్రత్యేక హోదా కోసం లోకేష్ ట్వీట్ చేస్తే   నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘అయ్యా లోకేష్ సారూ.. మీరు నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని కొందరు  ప్రశ్నించారు. హోదా కోసం ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టి అడ్డుకున్నది ఎవరు అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హోదా కోసం విశాఖకు వెళితే ఎయిర్ పోర్టులోనే అడ్డుకొని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ సారూ ఎక్కడ పడుకున్నారండీ అంటూ లోకేష్ ను కడిగిపారేశారు.

మీనాన్న చంద్రబాబు హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు నోరుమెపలేదేమిటి అని లోకేష్ ను నెటిజన్లు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ .. ప్రధాని మోడీ పర్యటనకు జనాలు వైసీపీ కార్యకర్తలను తరలిస్తున్నారని కొన్ని ఆటోలను ఉదాహరణగా లోకేష్ ట్వీట్ చేయడంపై నెటిజన్లు దిమ్మిదిరిగి కౌంటర్లు ఇచ్చారు. ‘ఆటోలపై జగన్ స్టిక్కర్లు ఆటోవాలాలు అభిమానంతో వేసుకున్నారు. బీజేపీ మీటింగ్ కోసం ఆ ఆటోలో వెళితే అంటగడుతావా? ఆటోవాలాల్లో జగన్ కు ఉన్న క్రేజ్ ను నువ్వే ట్విట్టర్ లో ఒప్పుకున్నావ్’ అంటూ కొందరు లోకేష్ కు సెటైర్లు వేశారు.  మరికొందరేమో.. ‘దేవాన్ష్ మోడీ తాతా అని పిలుస్తున్నాడా.? లేక సోనియా అమ్మమ్మ అంటున్నాడా’ అని టీడీపీ స్వార్థ రాజకీయాలపై ట్వీట్లతో లోకేష్ కు కౌంటర్లిచ్చారు.