Begin typing your search above and press return to search.

రాహుల్ - లోకేష్.. 'జబర్దస్త్' కాంబినేషన్

By:  Tupaki Desk   |   2 Nov 2018 9:59 AM GMT
రాహుల్ - లోకేష్.. జబర్దస్త్ కాంబినేషన్
X
సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏ సందర్భాన్ని వదలడం లేదు.. టాపిక్ దొరికితే చాలు తమ అనుభవన్నంతా రంగరించి సృజనాత్మకంగా పరిస్థితులను ఎండగడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ - టీడీపీ కలిశాయన్న నిజం చాలా మందికి మింగుడుపడటం లేదు. సిద్ధాంతాల పరంగా వ్యతిరేక భావాలు ఉన్న ఆ రెండు పార్టీలు ఒకే వేదిక మీదకు రావడాన్ని అక్రమ బంధంతో పోల్చుతున్నారు నెటిజన్లు.. రాహుల్ - లోకేష్ - బాలయ్య స్పీచ్ ల మీద తెగ సెటైర్లు పేలుస్తున్నారు.

తాజా పొలిటికల్ స్క్రీన్ మీద జబర్దస్త్ షోలు నడుస్తున్నాయనడంలో సందేహం లేదు. ఒకరేమో జాతీయ స్థాయిలో కామెడీ పండిస్తున్న అమూల్ బేబీ రాహుల్ కాగా - మరొకరు నాలుక మడతేసి జయంతుల్లో వర్థంతులను కలిపేసే హెరిటేజ్ బాయ్. ఇద్దరిలోనూ ఒక సారుప్యత ఉంది. ఇద్దరు పెద్దల చాటు బిడ్డలే. అంటే రాహుల్ తన తల్లి సోనియా - లోకేష్ తన తండ్రి చంద్రబాబు మీదే ఆధారపడ్డారు. ఇద్దరూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు.

వీరి మధ్యలో నట సింహం బాలకృష్ణ ఉండనే ఉండారు. ఈయన స్పీచ్ దడదడలాడాల్సిందే.. మొన్నటి అరవింద సమేతలో గుక్కతిప్పుకోకుండా ఇరగదీశాడాయన. ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఓ సభ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఊహగానాలతో పోస్టింగ్ లు పెడుతున్నారు. నిజంగా అదే జరిగితే ఎక్స్ స్ట్రా జబర్దస్త్ షో అవుతుందనడంలో సందేహం లేదు.

రాహుల్ కు అనువాదకుడిగా లోకేష్ వ్యవహరిస్తే ఆ సభ ఎంత సక్సెస్ అవుతుందో ఊహిస్తే సూపర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెడుతున్నారు.. దానికి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తే సీరియస్ నవ్వులు పూయడం ఖాయం. ఆ అవకాశం కోసం అందరూ ఎదురుచూడాలని నెటిజన్లు హోరెత్తిస్తున్నారు...