Begin typing your search above and press return to search.

పోలవరం కూడా పవన్ కల్యాణ్ కే ఇవ్వరాదా!

By:  Tupaki Desk   |   29 Aug 2016 10:30 PM GMT
పోలవరం కూడా పవన్ కల్యాణ్ కే ఇవ్వరాదా!
X
పుష్కరాల మీద వున్న శ్రద్ద రాష్ట్రాని ప్రత్యేక హోదా మీద గాని పోలవరం మీద గాని లేని చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమని మాట్లాడ్దం హస్యాస్పదంగా వుంది. ప్రత్యేక హోదా విషయంలో తమని పౌరుషం లేని వాళ్ళు అని తీవ్ర స్థాయిలో పవన్ విమర్శించినా 'పవన్ మంచి వాడు. అతను చేస్తున్నది సరైనదే, అతడ్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను' అని కితాబు ఇవ్వడం చూస్తుంటే ప్రభుత్వాధినేత గా చేయాల్సిన పనిని పవన్ అందుకుంటే ఆయన ఎందుకు మురిసిపోతున్నాడో అర్థం కావడం లేదు. అలా మురిసిపోవడమే కరెక్టు అయితే గనుక.. పోలవరం ప్రోజెక్ట్ కూడా పవన్ కి బాథ్యత ఇచ్చేస్తే మేలన్నట్టుగా జనం చంద్రబాబునాయుడు గురించి జోకులు వేసుకుంటున్నారు. ఎలక్షన్ మీటింగ్ లలో నరేంద్ర మోది తో స్టేజ్ పంచుకుని పోలవరం గురించి వాగ్ధానాలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు ప్రధాని అయిన అదే మోది దగ్గర ఎందుకు గట్టిగా పోరాడి నిధులు తెచ్చుకోలేక పోతున్నారు.

పోలవరాన్ని జాతీయ ప్రోజెక్ట్ గా ప్రకటించిన కారణంగా కేంద్రం నుండి 90శాతం నిధులు రావల్సివుండగా కేవలం 100 కోట్లు రావడం శోచనీయం. 2018 సంవత్సారనికి మొదటి ఫేజ్ పనులు పూర్తి చేస్తానని చెప్పే చంద్రబాబు ఏ విధంగా పూర్తి చేస్తాడు. ప్రత్యేక హోదా విషయంలో ఒక పక్క' నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను' అంటూనే మరో పక్క .'నేను ఈ విషయంగా నేను పలుమార్లు ప్రధానిని కలిసి విన్నవించాను' అంటాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందునా మిత్రపక్ష మైన పార్టీతో తమ హక్కుల కోసం గట్టిగా నిలదీయాల్సిందిపోయి, విన్నవించుకునే స్థాయిలో ఎందుకు వున్నారో అర్ధం కాని విషయం.

తిరుపతి సభలో పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించినా అతడ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అనడంలో మర్మం ఏంటి. తను కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని పరిస్థితిని పవన్ చేస్తున్నందుకు చంద్రబాబు నిజంగానే మనసులో అభినందిస్తున్నారా?! అలా అయితే ప్రత్యేక హోదా ఉద్యమం తో పాటు పోలవరం నిధుల విషయం కూడా పవన్ కి అప్పగిస్తే బెటర్. కేంద్రం నుంచి రాష్ర్టం హక్కుగా రాబట్టుకోవాల్సిన వాటిని సాధించడంలో.. ఏయే విషయాల్లో తను విఫలం అవుతున్నాడో వాటన్నిటినీ కూడా పవన్ కల్యాణ్ చేతుల్లో పెట్టేసి.. చంద్రబాబు ఎంచక్కా.. ఈవెంట్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందని జనం సెటైర్లు వేస్తున్నారు.