కర్ణాటకపై బాబు ట్వీట్లు.. నెటిజన్ల సెటైర్లు..

Sun May 20 2018 17:25:37 GMT+0530 (IST)

కర్ణాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరికీ ఆసక్తి గొలిపాయి.. ఈ విషయంలో చంద్రబాబు సైతం స్పందించారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్ ‘ప్రోటెం స్పీకర్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ.. కర్ణాటక గవర్నర్ కు హితబోధ చేస్తున్నట్లుగా ఉంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. శనివారం యడ్యూరప్పపైనా చంద్రబాబు ట్వీట్ చేశారు. యెడ్డీ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని.. ఆయన రాజీనామాతో అందరూ సంతోషంగా ఉన్నారని  బాబు పేర్కొన్నారు.తాజాగా చంద్రబాబు చేసిన ట్వీట్లపై నెటిజన్లు సెటైర్లతో హోరెత్తిస్తున్నారు.. ప్రజాస్వామ్యం కూనీ అని చంద్రబాబు చేసిన ట్వీట్ కు సమాధానంగా.. ‘బాబూ గారు.. మీ పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడే ప్రజాస్వామ్యాన్ని చంపేశారని.. సార్.. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకండని ’ ఓ నెటిజన్ ఘాటుగా రిప్లై ట్వీట్ ఇచ్చాడు.

ఇక మరో నెటిజన్ అయితే.. ‘‘కర్ణాటక రాజకీయాలపై బాబు మాట్లాడాక.. తనకు ఎన్టీఆర్ ఆనాడు ఎలా కుట్రలకు బలయ్యాడో గుర్తుకొస్తోందని.. టీడీపీని మీరు ఆధీనంలోకి తీసుకుందని నెమరువేసుకుంటానని’’ చంద్రబాబుకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే చివరి వ్యక్తి బాబేనని మరొకరు సెటైర్ వేశారు.

కొందరు నెటిజన్లు అయితే బాబు ఓటును నోటు కేసును గుర్తు చేశారు. మామను వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను హోటల్లో బంధించినప్పుడు ప్రజాస్వామ్యం ఎటుపోయిందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.. నాలుగేళ్లు మోడీతో అంటకాగి.. ఇప్పుడు మోడీనే తిట్టడం బాబుకు నప్పలేదని ట్వీట్లు చేశారు. ఇలా చంద్రబాబు కర్ణాటకలో జరిగిన పరిణామాలపై చేసిన ట్వీట్లకు భారీ స్పందన వస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా రీట్వీట్లు హోరెత్తుతున్నాయి.