చిన్నమ్మ ఈగోను మళ్లీ హర్ట్ చేశాడే

Fri Feb 17 2017 22:11:13 GMT+0530 (IST)

చిన్నమ్మ.. పన్నీర్ మధ్య నడుస్తున్న వార్ పుణ్యమా అని సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు అన్నిఇన్నికాదు. శాంపిల్ గా చూస్తే.. చిన్నమ్మ తాను కోరుకున్న ‘సీఎం’ పదవిని ఎట్టకేలకు చేజిక్కించుకున్నారంటూ.. ‘సీఎం.. సీ ఫర్ క్యాండిల్ ఎం ఫర్ మేకింగ్.. క్యాండిల్ మేకింగ్ (జైల్లో కొవ్వొత్తులు.. అగరొత్తులు తయారీ పని చేయాల్సి ఉండటం తెలిసిందే) ఎకసెక్కాలు చేసేస్తున్నారు. అంతేనా.. జైల్లో అధికారులు శశికళను ఏం తింటారని అడిగితే.. ‘పన్నీర్ తప్ప ఏదైనా ఫర్లేదు’’ అని చెప్పుకునే జోకుకూడా బాగానే పేలుతుంది. ఈ జోకుల ముచ్చట ఇలా ఉంటే.. జైల్లో ఉన్న శశికళ ఈగో అదేపనిగా హర్ట్ అవుతోంది.

జైల్లోకి తన ఎంట్రీ ఇవ్వటానికి కొన్ని గంటల ముందే.. తనకేం కావాలో కోర్కెల చిట్టాను పంపితే రిజెక్ట్ అయి చిరాకు తెప్పిస్తే.. ఇంటి నుంచి తెప్పించిన సామాను (కంచం.. గ్లాస్..చెంబు.. దుప్పటి.. తదితరాలు) అవేమీ లోపలకు పంపేది లేదంటూ.. కాదూ కూడదంటే పళ్లెం.. గ్లాసును అనుమతించారు. వస్త్రాల విషయంలోనూ మూడు జతల సాదాసీదా చీరలు ఇచ్చారు. ఆ క్షణంలో మరోసారి ఇగో హర్ట్ అయ్యింది.

జైలుకు తీసుకెళ్లే సమయంలోనూ వ్యాన్ ఎక్కిస్తామంటే.. ఎంతదూరమైనా ఫర్లేదు నడుస్తానే తప్పించి.. పోలీస్ వ్యాన్ ఎక్కటం ఏమిటంటూ అగ్గి ఫైర్ అయ్యారు. పోలీసులు తనతో మాట్లాడిన ఈ మాటలకు ఆమె మరింత హర్ట్ అయ్యిందనే చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కాకున్నా.. పక్కరోజునైనా తన తాజా విధేయుడు పళనిస్వామి జైలుకు వెళతారని భావించారు.

తాజా పరిణామాల నేపథ్యంలో.. పన్నీర్ పుణ్యమా అని రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేల్ని కాపాడుకోవటానికే టైం సరిపోని పరిస్థితి. దీంతో.. చిన్నమ్మను చూసేందుకు వెళితే.. ఉన్న ఎమ్మెల్యేలు కకావికలమయ్యే అవకాశం ఉందన్న సందేహంతో ఆయన జైలుకు వెళ్లలేదు. తాను సీఎం చేసిన తన విధేయుడు.. తనను చూసేందుకు జైలు రాకపోవటం చిన్నమ్మ ఇగోను మరోసారి హర్ట్ చేసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో మరెన్నిసార్లు ఆమె ఇగో హర్ట్  అవుతుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/