హరీశ్ కు కాంగ్రెస్ పెద్దాయన సలహా ఇదే!

Fri Apr 21 2017 09:59:47 GMT+0530 (IST)

తన్నీరు హరీశ్ రావు... ఈ పేరు వింటేనే కేసీఆర్ మేనల్లుడే మన కళ్ల ముందు కదలాడతారు. కేసీఆర్ టీడీపీలో ఉన్న సమయంలోనే కాకుండా... టీఆర్ ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు ముఖ్య అనుచరుడిగానే కాకుండా... కేసీఆర్ కు చెందిన అన్ని పనులకు చకచకా చక్కబెట్టిన వ్యక్తిగా హరీశ్ రావు తెలుగు ప్రజలందరికీ చిరపరచితులే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ కేసీఆర్ సాగించిన 14 ఏళ్ల అలుపెరగని పోరులో... ఆయన ప్రతి అడుగు వెనుకా హరీశ్ రావు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో.

మామా అల్లుళ్ల పోరాటం ఫలించి తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం కాగా... కేసీఆర్ తెలంగాణకు తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా హరీశ్ రావు ఆయన మంత్రివర్గంలో కీలక శాఖల మంత్రిగా మారిపోయారు. ఇక ఉద్యమ సమయం నాటి తీపి జ్థాపకాలను ఓ సారి గుర్తు చేసుకుంటే... కేసీఆర్ ఖాళీ చేసిన సిద్ధిపేట అసెంబ్లీలో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన హరీశ్... మామకు మించి మెజారిటీ సాధించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. ఇప్పటికీ సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా... చాలా మందిని హరీశ్ రావు పేరు పెట్టి మరీ ఆప్యాయంగా పిలుస్తారట. ఈ తరహా కలివిడి తనమే హరీశ్ రావును కేసీఆర్ కంటే కూడా కింగ్ ను చేసిందనే చెప్పాలి.

అయితే ఎంత ఎదిగినా... ఒదిగి ఎండాలన్న భావనతో కేసీఆర్ అడుగు జాడల్లోనే హరీశ్ సాగుతున్నారు. ఇలాంటి హరీశ్ రావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఓ ఉచిత సలహా పడేశారు. హరీశ్ రావు సత్తాను కీర్తిస్తూనే... కేసీఆర్‌కు వెన్నుపోటు పోడిస్తే నీవే సీఎం అంటూ లేనిపోని ఆలోచనలను రేకెత్తిస్తున్నారు. ఈ తరహా సలహాలను హరీశ్ రావు పట్టించుకోరు గానీ... అసలు హరీశ్ కు సర్వే ఇచ్చిన సలహా వింటే మాత్రం మనం షాక్ తింటాం.

అయినా హరీశ్ రావు గురించి సర్వే ఏమన్నారంటే... సీఎం అయ్యే క్వాలిటీస్ హరీశ్ రావులో ఉన్నాయి. చాలా హార్డ్ వర్కర్. పార్టీని నడిపింది ఆయనే. టీఆర్ ఎస్ కోసం చప్రాసీలా పని చేశాడు. కేసీఆర్ ఫ్యామిలీ ఆయనను సైడ్ చేసింది. కేటీఆర్ - కవిత వచ్చాక హరీశ్ ప్రాధాన్యం తగ్గింది. హరీశ్ ఎఫిషియెంట్! అందుకే నేను సిద్దిపేట వెళ్లినప్పుడు హరీశ్ కు సీఎం యోగం ఉందన్నాను. అం దుకే హరీశ్! నువ్వు మీ మామకు వెన్నుపోటు పొడువ్. నీ వెం ట మేముంటాం. నీ సీఎం డ్రీమ్ పూర్తి చేసుకో’’ అని  సర్వే సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/