మ్యాచ్ మధ్యలో శృంగారం..ఆటకు బ్రేక్!

Thu Apr 20 2017 19:55:17 GMT+0530 (IST)

వివిధ క్రీడల్లో భాగంగా మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అంతరాయం కలుగడం చాలా సహజం. కొన్ని ప్రకృతి సృష్టిస్తే మరికొన్ని మానవ సాంకేతిక తప్పిదాలతో జరుగుతుంటాయి. కానీ ఓ జంట శృంగారంలో పాల్గొంటూ చేసిన ధ్వనులకు ఏకంగా టెన్నిస్ మ్యాచే ఆగిపోయింది. నమ్మలేకపోతున్నారా? నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే నిజంగా జరిగింది కాబట్టి.

ఫ్లోరిడాలో జరిగిన ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఫ్రాన్సిస్ తియాఫో - మిచెల్ క్రూగర్ ల మధ్య మ్యాచ్ జరుగుతున్న వేళ.. రెండోసెట్ మధ్యలో తియాఫో సర్వీస్ కు సిద్ధమవుతున్నాడు. ప్లేయర్ బంతిని ఇలా గాల్లోకి లేపాడో లేదో....మత్తైన ఓ తీయని మూలుగు వినిపించిడంతో ఒక్కసారిగా సర్వీస్ ఆపేశాడు. చుట్టుపక్కలా చూశాడు. కానీ ఆ ధ్వని మాత్రం ఆగలేదు. మెల్లగా చైర్ అంపైర్ దగ్గరకు వెళ్లి చెవిలో గొణిగాడు. అతనూ మైదానం మొత్తం పరిశీలనగా చూశాడు. ఎవరో సౌండ్ తగ్గించడం మర్చిపోయి మొబైల్ లో నీలి చిత్రం చూస్తున్నారని కామెంటేటర్ మైక్ కాషన్ తో సహా అందరూ అనుకున్నారు. కానీ ఎంతసేపైనా సౌండ్స్ మారుతున్నాయిగానీ ఆగడంలేదు!

ఇక లాభం లేదనుకుని సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించడం మొదలుపెట్టారు. ఇంకేముంది... స్టేడియం పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ లో అప్పుడప్పుడే శృంగార కార్యం మొదలుపెట్టిన ఓ జంట గుట్టుచప్పుడుగా సంబోగాన్ని ముగించకుండా కామాన్ని పీక్స్‌లోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మైమరిచిపోయి వాళ్లు చేసిన ధ్వనుల దెబ్బకు ఆటగాళ్ల ఏకాగ్రత హుష్‌కాకి అయ్యింది. ఈ సీన్ మొత్తాన్ని చూసిన ప్రేక్షకుల్లో కొందరు సరదాగా నవ్వుకుంటే మరికొందరు ఛీ పాడు అనుకుంటూ వెళ్లిపోయారు!Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/