Begin typing your search above and press return to search.

ఇద్దరు భారతీయులకు రామన్ మెగసెసె అవార్డు

By:  Tupaki Desk   |   29 July 2015 8:01 AM GMT
ఇద్దరు భారతీయులకు రామన్ మెగసెసె అవార్డు
X
ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డుకు ఈ ఏడాది ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. ఎయిమ్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన సంజీవ్ చతుర్వేది, గూంజ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న అన్షు గుప్తాలకు ఈ అవార్డు వరించింది.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చీఫ్ విజిలెన్సు కమిషనర్ గా పనిచేసిన సంజీవ్ చతుర్వేది అక్కడ జరుగుతున్న అవకతవకలు, కుంభకోణాలను బయటపెట్టారు. దాంతో ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించారు. దేశసమగ్రతకు పాటుపడడంతోపాటు, అవినీతిపై పోరులో ధైర్యం చూపడంతో ఆయనకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు రామన్ మెగసెసె పురస్కారాల కమిటీ పేర్కొంది.

ఈ పురస్కారానికి ఎంపికైన మరో విజేత అన్షు గుప్తా సేవారంగానికి చెందినవారు. ఆయన గూంజ్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఇద్దరూ ఈ ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.