Begin typing your search above and press return to search.

సానియా...చెంపచెళ్ళు మనిపించినట్లే!

By:  Tupaki Desk   |   18 Feb 2019 7:25 AM GMT
సానియా...చెంపచెళ్ళు మనిపించినట్లే!
X
తప్పు లేదు.. దేశ భక్తిని వివిధ రూపాల్లో చాటుకుంటారు. కొందరు దేశం కోసం ప్రాణాలు ఆర్పిస్తారు. మరి కొందరు తమకు తోచిన వైనంలో దేశంపై ప్రేమను చూపిస్తారు. అయితే సోషియల్ మీడియా అన్న వైరస్ అణువనువునా మనలోకి చూచ్చుకుపోతూ ఉండడంతో దేశ భక్తిని కూడా సోషియల్ మీడియాకే పరిమితం చెయ్యాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిపోయింది ప్రస్తుత సమాజం. కాదంటారా...ఒక్కసారి ఈ మ్యాటర్ చూడండి, మీరే ఒప్పుకుంటారు.

సానియా మీర్జా... భారత దేశంలో పుట్టి. టెన్నిస్ ప్లేయర్ గా భారత కీర్తి పతకాన్ని అనేక చోట్ల రెపరెపలాడించిన వనిత. అయితే ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోవడం అదృష్టమో, లేక పాకిస్తానీని పెళ్లి ఆడటం దురదృష్టమో తెలీదు కానీ.. నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని పాకిస్తాన్ వెళ్లిపోయింది ఆమె. ఇక తాజాగా పుల్వామా ఘటన విషయంలో సోషియల్ మీడియాలో కొందరు ఆమెను ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. అసలు ఆ ఘటనకి, ఆమెకి ఏమాత్రం సంబంధం లేకపోయినా, పాకిస్తాన్ పై ప్రేమతోనే సానియా ఈ టెరరిస్ట్ అట్యాక్ పై స్పందించలేదు అని రకరకాలుగా పిచ్చి రాతలు రాశారు. అయితే వాటన్నింటికీ ఆమె తనదైన శైలిలో సమాధానం ఇస్తూ... ముందుగా ఆ అట్యాక్ లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలుపుతూ...

సోషియల్ మీడియాలో పదుల సంఖ్యలో రాస్తేనే దేశ భక్తి కాదని, దేశం కోసం, దేశ కీర్తిని పతాక స్థాయిలో ఎగరవేయ్యడం కోసం, పని చేసినా దేశభక్తి అని ఆమె సున్నితంగా, ఏమాత్రం సుత్తి లేకుండా...హద్దులు దాటి మాట్లాడకుండా ఆ విమర్శలకు చెక్ పెట్టింది.ఆమె అన్నది అని కాదు కానీ, నిజమే, సోషియల్ మీడియా లాంటి భూత ప్రపంచంలో బ్రతుకుతున్న మనం...అదే సోషియల్ మీడియాలో సంతాపం తెలపడమే దేశ భక్తి అని అనుకుంటే, దేశం తరపున ఆడి, దేశ కీర్తిని ఎన్నో సంధర్భాల్లో నిలబెట్టిన ఆమెది కూడా దేశభక్తినే కదా...మరి ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యీ నోరు పారేసుకుంటే ఎలా చెప్పండి.