Begin typing your search above and press return to search.

గోమాంస వ్య‌తిరేక బీజేపీ గొంతులో వెల‌క్కాయ‌

By:  Tupaki Desk   |   10 Oct 2015 9:37 AM GMT
గోమాంస వ్య‌తిరేక బీజేపీ గొంతులో వెల‌క్కాయ‌
X
గోమాంసంపై గొంతెత్తున బీజేపీకి కొత్త స‌మ‌స్య ఎదురైంది. బీజేపీ న‌ట్టింట్లోనే బీఫ్ బ‌స్తాలు దొరిక‌న‌ట్ల‌యింది... దీంతో విప‌క్షాల నోటికి ప‌నికి త‌గిలింది... స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి బీజేపీకి ఎదురైంది. బీజేపీ ఎమ్మెల్యే పరిస్థితి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని సర్దానా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శాసనసభ్యునిగా గెలిచిన సంగీత్‌ సింగ్ శ్యామ్ బీఫ్‌ ను ఎగుమతి చేసే ఆల్ దువా కంపెనీకి డైరెక్టర్‌....ఆ విష‌యాన్ని ఆయ‌న అంగీక‌రించ‌డంతో పెద్ద దుమారమే రేగింది. ఆవు మాంసం అమ్ముతున్న ఎమ్మెల్యే పెద్ద సుద్ద‌పూస‌లా గోమాంస‌ వ్యతిరేకంగా ఉద్యమంలో ఎలా ఉంటారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముజఫర్‌ నగర్ అల్లర్లకు కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగీత్ ‌సింగ్‌ కు భారత్‌ లో పేరొందిన బీఫ్ ఫ్రొసెస్ కంపెనీ ఉన్నట్టు ఉన్నట్టు హిందూ పేప‌ర్ లో స్టోరీ రావ‌డంతో ఈ సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. ఇంకేముంది విప‌క్షాలు విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టాయి.

మొయినుద్దీన్ ఖురేషీ అనే వ్యక్తితో కలిసి 2005 ‌లోనే సంగీత్ సింగ్ ఆల్ దువా ఆక్వాఫుడ్ అండ్ ప్రొసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ ను ప్రారంభించారు. తొలుత ఈ ఎమ్మెల్యే గారు త‌న‌కు ఆ వ్యాపారంతో సంబంధ‌మే లేద‌ని... అచ్చ‌మైన హిందువునైనా తాను రోజూ గోవుల‌కు పూజ‌లు చేస్తూ వాటి మాంసాన్ని ఎలా ఎగుమ‌తి చేస్తాన‌ని బుకాయించారు. తాను గుడ్డు కూడా తిన‌న‌ని చెబుతున్నారు.

అయితే... 2005లో ఏర్పాటైన ఈ కంపెనీకి సంగీత్ సింగ్ 2008 వ‌ర‌కు డైరెక్ట‌రుగా ఉన్నారు. 2008లో డైరెక్టర్ పదవి నుంచి తప్పుకుని తన పేరిట ఉన్న వాటాను వేరొక‌రికి బ‌దిలీ చేశారు. విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున రావ‌డంతో ఆయ‌న ఇప్పుడు త‌న‌కు తెలియ‌కుండానే త‌న‌ను డైరెక్ట‌రుగా పెట్టారంటూ ప‌రోక్షంగా అస‌లు విష‌యాన్ని అంగీక‌రించారు. ఆ త‌రువాత ఇంకో మెట్టు దిగి ఆల్ దువా కంపెనీకి తాను కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే డైరెక్టర్‌ గా ఉన్నాననీ... ఆ కంపెనీ ఏం విక్ర‌యిస్తుందో కూడా త‌న‌కు తెలియ‌దంటున్నాడు... ఎలా క‌వ‌ర్ చేసినా అంటుకున్న మ‌కిలిపోదు క‌దా..