Begin typing your search above and press return to search.

శాంసంగ్ కు కొత్త సమస్య.. మరో మోడల్!

By:  Tupaki Desk   |   25 Oct 2016 6:53 AM GMT
శాంసంగ్ కు కొత్త సమస్య.. మరో మోడల్!
X
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మోడల్ ఫోన్ శాంసంగ్ కంపెనీని కుదిపిన కుదుపు చిన్న విషయం కాదు. ఈ ఒక్క ఫోన్ బ్యాటరీ సృష్టించిన మంటలతో కంపెనీ క్రెడిబిలిటీ దెబ్బతినడమే కాకుండా ఆర్ధికంగా కూడా భారీ దెబ్బనే చవిచూసింది శాంసంగ్. ఐతే ఆ గెలాక్సీ నోట్ 7 మిగిల్చిన మంటలు ఇంకా చల్లారకముందే ఆ కంపెనీకి మరో షాక్ తగిలింది. అదే కంపెనీకి చెందిన మరో స్మార్ట్ ఫోన్ కూడా పేలిపోయింది.

అమెరికాలోని ఒక వ్యక్తి దగ్గరున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ పేలిందని స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో మరోసారి శాంసంగ్ ఫోన్లు పేలుతున్నాయి అనే వార్త ఆన్ లైన్ లో కూడా హల్ చల్ చేస్తోంది. అయితే ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ కూడా చార్జింగ్ పెడుతుండగానే పేలిపోయిందని "ఫోన్ ఎరినా" పేర్కొంది. రాత్రంతా ఒరిజినల్ చార్జర్ తో చార్జ్ చేసినా కూడా ఫోన్ పేలిందని, ఈ ఘటనలో బాధితుడికి స్వల్పంగా గాయాలయ్యాలని తెలిపింది. అయితే శాంసంగ్ నోట్ 7కు బదులుగా ఈ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ను రెండు వారాల క్రితమే సదరు వ్యక్తి తీసుకున్నాడట. ఇందులో బ్యాటరీ సురక్షితమైందని కంపెనీ కంపెనీ భరోసా ఇవ్వడంతోనే ఈ ఆ ఫోన్ కు బదులు ఈ మోడల్ ఫోన్ తీసుకున్నానని బాధితుడు చెపుతున్నాడు.

కాగా, శాంసంగ్ నోట్ 7 వినియోగదారులు అమెరికాలో పలుచోట్ల కోర్టుల్లో ఇప్పటికే దావాలు వేశారు. తమకు శాంసంగ్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చెల్లింపుల సంగతి అలా ఉంటే... గెలాక్సీ నోట్ 7 రేపిన మంటలతో శాంసంగ్ కు రాబోయే ఆరు నెలల్లో సుమారు 3 బిలియన్ డాలర్లుపైగా నష్టం వాటిల్లే అవకాశముందని నిపుణులు అంచానా వేస్తున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/