Begin typing your search above and press return to search.

చీర కడుతూ చెత్త పని చేసినందుకు ఏడాది జైలు!

By:  Tupaki Desk   |   22 Aug 2019 4:46 AM GMT
చీర కడుతూ చెత్త పని చేసినందుకు ఏడాది జైలు!
X
హైదరాబాద్ లోని ఒక షోరూమ్ లో సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి చేసిన చెత్త పనికి భారీ జైలుశిక్ష పడింది. చీర కట్టే క్రమంలో అతగాడు చేసిన చెత్త పనికి భారీగా మూల్యాన్ని చెల్లించాల్సిన వైనమిది. కూకట్ పల్లి 8ఎ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.

కూకట్ పల్లి వై జంక్షన్ లోని ఒక ప్రముఖ వస్త్ర దుకాణంలో వికారాబాద్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల యాదగిరి పని చేస్తున్నాడు. బట్టల షాపులో సేల్స్ సూపర్ వైజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అతగాడు గత ఏడాది జులై 31న షోరూమ్ కు చీర కొనేందుకు వచ్చిన ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా వ్యవహరించాడు.

చీర కట్టే క్రమంలో ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు యువతి.. ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు. కేసు విచారణలో భాగంగా కోర్టు తాజాగా ఈ కేసుపై తీర్పును ఇచ్చారు. నిందితుడి చేసిన తప్పుడు పనికి శిక్షగా ఏడాది జైలుశిక్షతో పాటు.. రూ.2వేల ఫైన్ ను విధిస్తూ మేజిస్ట్రేట్ శ్రీదేవి తీర్పును ఇచ్చారు. చెత్త పని చేస్తే శిక్ష ఎంత భారీగా ఉంటుందో కూకట్ పల్లి న్యాయస్థానం ఫ్రూవ్ చేసినట్లైంది.