'సాక్షి' సర్వేలో సంచలన ఫలితాలు?

Sat Apr 13 2019 20:33:32 GMT+0530 (IST)

ఈ ఎన్నికల ముందు అన్ని మీడియా వర్గాలూ తమ దైన సర్వేలను చేయించుకున్నాయి. ఎవరికి వారు తమ తమ ఇన్ హౌస్ సిబ్బందిని ఉపయోగించుకుని సర్వేలను చేయించుకున్నారు. దీనికి ఏ మీడియా హౌస్ కూడా మినహాయింపు కాదు. జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియా సంస్థ కూడా ఒక సర్వేను చేసినట్టోగా భోగట్టా.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంతమైన ఈ మీడియా సంస్థ తమ యజమాని కోసం ఒక సర్వేను ప్రిపేర్ చేసినట్టుగా సమాచారం. అయితే ఇందులో స్వామి భక్తి చాలా ఎక్కువ అయ్యిందని తెలుస్తోంది. ఎందుకంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించబోతోందని ఈ సర్వే అంచనా వేయడం విశేషం.

ప్రత్యేకించి సీట్ల నంబర్ విషయంలో సాక్షి సంచలనాన్నే నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సాక్షి లెక్కల ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 166 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని తేలిందట! వినడానికే ఈ నంబర్ చాలా ఓవర్ గా ఉంది కదా. అయితే అధినేతను మెప్పించడానికి సాక్షి తాపత్రయ పడినట్టుగా ఉంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవొచ్చు అనే అంచనాలు ఉన్నా.. ఈ నంబర్ మాత్రం మరీ టూమచ్ గా ఉంది.  ఈ సర్వే ఫలితాలను జగన్ కు తెలియజేశారట. బహుశా జగన్ కూడా ఈ నంబర్లను విని విస్తుపోయి ఉండవచ్చు. ఇక ఈ సర్వే ఫలితాల గురించి తెలిసిన బయటవారు మాత్రం ‘బాప్ రే సాక్షి’ అని అనుకుంటున్నారట!

తెలుగుదేశం పార్టీ కేవలం తొమ్మిది సీట్లలో నెగ్గుతుందని.. బొబ్బిలి - విజయనగరం - విశాఖ ఈస్ట్ - పెద్దాపురం - కొత్తపేట - విజయవాడ ఈస్ట్ - హిందూపురం - ధర్మవరం - కుప్పం సీట్లు మాత్రమే తెలుగుదేశం నెగ్గుతుందని ఈ సర్వే  అంచనా వేసిందట!