Begin typing your search above and press return to search.

‘లవ్’ గురించి చెప్పిన సైనా

By:  Tupaki Desk   |   28 April 2016 4:21 AM GMT
‘లవ్’ గురించి చెప్పిన సైనా
X
పక్కింటి అమ్మాయిలా ఉంటుంది బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్. ఆకర్షణీయంగా ఉన్నా తనను తాను బ్యూటీ ఐకాన్ లా ఫోకస్ కావటానికి ఏ మాత్రం ఇష్టపడని క్రీడాకారిణి సైనా నెహ్వాల్. కాస్త నదురుగా ఉండే సెలబ్రిటీల గ్లామర్ మీద మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఆ లెక్కన సైనా నెహ్వాల్ మీద ‘గ్లామర్’ యాంగిల్ బయటకు రావాలి. కానీ.. సైనాను మీడియా ఎప్పుడూ అలా చూడలేదు. దీన్లో మీడియా కంటే కూడా సైనానే కారణం.

నిత్యం పని.. పని.. పని అన్నట్లుగా ఉండటం.. ప్రైవేటు పార్టీలకు తక్కువగా వెళ్లటం.. వెళ్లినా గ్లామర్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవటం.. సీరియస్ గా ఉండటం లాంటి వాటితో పాటు అందాన్ని ఎలివేట్ చేయాలన్న తపన అస్సలు కనిపించకపోవటం లాంటి కారణాలతో సైనాలోని ‘అందం’ కోణాన్ని మీడియా సైతం పెద్దగా టచ్ చేయలేదనే చెప్పాలి. అందుకే మిగిలిన సెలబ్రిటీలు.. స్టార్లను ఇంటర్వ్యూ చేసే సమయంలో రెగ్యులర్ గా వచ్చే చాలా ప్రశ్నలు సైనాను ఇంటర్వ్యూ చేసే విషయంలో అస్సలు కనిపించవు.

అయిటే ఫిట్ నెస్ మీద నాలుగు ప్రశ్నలు ఉంటాయే కానీ.. బ్యూటీ మీదా.. అఫైర్ల మీద వార్తలు అస్సలు కనిపించవు. మరి.. అలాంటి సైనా ‘లవ్’ గురించి మాట్లాడితే కాస్త ఆసక్తికరమే. నిజానికి.. ఆ విషయం మీద సైనా పెదవి విప్పుతుందా? అన్న సందేహంతో ఉండేవాళ్లు చాలామందే ఉంటారు. తాజాగా లవ్ గురించి పెదవి విప్పింది సైనా. కాకుంటే.. తనకు వర్క్ తప్పించి ప్రేమించేంత టైం లేదని చెప్పుకొచ్చింది.

తొమ్మిదేళ్ల వయసు నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్న సైనా గడిచిన 16 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నారు. నిత్యం కఠినమైన ప్రాక్టీస్.. షెడ్యూల్ ప్రకారం వ్యవహరించటమే తప్పించి.. మిగిలిన అంశాల మీద సైనా దృష్టి సారించినట్లుగా పెద్దగా కనిపించదు. రిలేషన్స్ పెంచుకోవటానికి సమయం లేదని చెప్పే సైనా.. సోషల్ మీటింగ్స్ ను పట్ల అస్సలు ఆసక్తి ప్రదర్శించరు. ప్రేమ అనేది సుదీర్ఘమైనదని.. ప్రస్తుతం తన దగ్గర అంత టైం లేదని తేల్చేసింది. లవ్ అన్నది సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. మరి.. సైనా మనసును దోచుకునే మానసచోరుడు భవిష్యత్తులో అయినా వస్తారో.. లేదో చూడాలి.