Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై ఆమె ఎంతమాట అన్నారంటే..!

By:  Tupaki Desk   |   20 May 2019 5:23 AM GMT
ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై ఆమె ఎంతమాట అన్నారంటే..!
X
ఎగ్జిట్ పోల్స్ పై మాజీ ఎంపీ.. రాజ‌కీయాల నుంచి దూరంగా వెళ్లిపోయిన‌ట్లు చెప్పుకునే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చెప్పిన అంచ‌నాలు తెలిసిందే. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఉన్న ఆయ‌న అంచ‌నాల‌పై ప‌లువురు విమ‌ర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్స్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌మ్ పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల అబ్జ‌ర్వ‌ర్ శైల‌జ చ‌ర‌ణ్ రెడ్డి తాజాగా ధ్వ‌జ‌మెత్తారు.

ల‌గ‌డ‌పాటి స‌ర్వేను ఆమె ల‌త్కోర్ స‌ర్వేగా తేల్చేశారు. ఆంధ్ర బెట్టింగ్ బుకీల‌తో డీల్ కుదుర్చుకొని బోగ‌స్ స‌ర్వేను ఆయుధంగా విడుద‌ల చేశార‌ని మండిప‌డ్డారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వే అంటేనే బెట్టింగ్ ల కోస‌మే అనేది అంద‌రికి తెలిసిన సీక్రెట్ గా ఆమె వ్యాఖ్యానించారు.

ల‌గ‌డ‌పాటి స‌ర్వేను న‌మ్మే ప‌రిస్థితుల్లో తెలుగు ప్ర‌జ‌లు లేర‌న్న ఆమె.. స‌ర్వేల‌కు కాలం చెల్లింద‌న్నారు. తెలంగాణ‌లో మ‌హాకూట‌మి గెలుస్తుంద‌ని ప్ర‌క‌టించి బోల్తా ప‌డ్డార‌ని.. ఇప్పుడు అదే త‌ప్పును మ‌ళ్లీ పున‌రావృతం కానున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు. బెట్టింగుల‌కు ప్రోత్స‌హించేలా బోగ‌స్ స‌ర్వే విడుద‌ల చేసిన ల‌గ‌డ‌పాటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. ల‌గ‌డ‌పాటి స‌ర్వేను వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియ‌న్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వెల‌గ‌ప‌ల్లి ప్ర‌దీవ్ తీవ్రంగా త‌ప్పు పట్టారు. బెట్టింగ్ రాయుళ్ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి కోట్లాది రూపాయిలు దోచుకోవ‌టంలో భాగంగానే చంద్ర‌బాబు అండ్ కో ల‌గ‌డ‌పాటితో స‌ర్వే నాట‌కాలు ఆడుతున్న‌ట్లుగా మండిప‌డ్డారు.