Begin typing your search above and press return to search.

స‌చిన్‌కు షాకిచ్చిన సొంత కొడుకు

By:  Tupaki Desk   |   8 Oct 2015 1:30 PM GMT
స‌చిన్‌కు షాకిచ్చిన సొంత కొడుకు
X
క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండుల్క‌ర్‌ కు ఆయ‌న కొడుకు షాకిచ్చాడు. స‌చిన్ న‌డిచిన క్రికెట్ బాట‌లో న‌డ‌వ‌కూడ‌ద‌ని ఆయ‌న కొడుకు అర్జున్ టెండుల్క‌ర్ డిసైడ‌య్యారు. ఈవార్త క్రికెట్ దేవుడి అభిమానుల‌కు నిరాశ క‌లిగించేదే అయిన‌ప్ప‌టికీ వాస్త‌వం. ఇంత క‌చ్చితంగా ఎలా చెప్ప‌గ‌లుగుతున్నామంటే...ఈ విష‌యాన్ని వెల్ల‌డించిందీ సాక్షాత్తు స‌చిన్ టెండూల్క‌రే కాబ‌ట్టి.!

త‌న కొడుకు క్రికెట్ ఆట‌ను ఎంచుకోకుండా ఎయిర్ ఫోర్స్‌ లో జాయిన్ అవ్వాల‌ని కోరుకుంటున్నార‌ని స‌చిన్ మీడియా సమ‌క్షంలో వెల్ల‌డించారు. న్యూఢిల్లీలో జ‌రిగిన ఎయిర్‌ ఫోర్స్ అకాడ‌మీ వేడుక‌ల్లో పాల్గొన్న సంద‌ర్భంగా స‌చిన్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. త‌న కుమారుడికి ఎయిర్‌ ఫోర్స్ అంటే విప‌రీత‌మైన ఆస‌క్తి అని స‌చిన్ అన్నారు. త‌న కుమారుడిని ఈ కార్య‌క్ర‌మానికి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నించాన‌ని స‌చిన్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌న కుమారుడు అర్జున్ టెండుల్క‌ర్ ఎయిర్‌ ఫోర్స్‌ లో చేరుతారా అనేది ఇప్పుడే నిర్ణ‌యించ‌లేమ‌ని అన్నారు. ఇంకా స‌రైన వ‌య‌సు లేనందున ఆయ‌న దేశ సేవ‌లోకి రావ‌డంపై స్ప‌ష్టంగా చెప్ప‌లేమ‌ని అన్నారు. ఇండియ‌న్ ఎయిర్‌ ఫోర్స్ లో కెప్టెన్ హోదాలో స‌చిన్ 2010 నుంచి గౌర‌వ స్థానం పొందుత‌న్న సంగ‌తి తెలిసిందే. కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం త‌న కార్య‌క్ర‌మం బాగా జ‌రిగిందంటూ స‌చిన్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.