Begin typing your search above and press return to search.

క్రికెట్ దేవుడు క్రీజ్ లోకి వస్తున్నాడు

By:  Tupaki Desk   |   6 Oct 2015 9:38 AM GMT
క్రికెట్ దేవుడు క్రీజ్ లోకి వస్తున్నాడు
X
క్రికెట్ దేవుడిగా కీర్తిని అందుకున్న మాస్టర్ బ్లాస్టర్.. భారతరత్న సచిన్ టెండూల్కర్ తాజాగా క్రికెట్ క్రీజ్ లోకి రానున్నారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పారుగా అన్న ప్రశ్న అక్కర్లేదు. క్రికెట్ దేవుడు ఈసారి ఒక పెద్ద కార్యం కోసం క్రీజ్ లోకి అడుగు పెట్టనున్నారు.

ఇప్పటికే పలు దేశాల్లో ఆదరణ పొందుతున్న క్రికెట్ ఆటకు.. అమెరికాలో ప్రాచుర్యం తక్కువే. ఈ కొరత తీర్చేందుకు.. ప్రపంచంలోని దిగ్గజ ఆటగాళ్లు ఓ పాతిక మంది కలిసి అమెరికాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ ఆడుతూ.. ఈ క్రీడకు విశేష ప్రచారాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికాలో భారీ ప్రాచుర్యం కోసం.. అక్కడి పలు బేస్ బాల్ స్టేడియంలను క్రికెట్ స్టేడియంలుగా మార్చనున్నారు.

నవంబరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్.. లాస్ ఏంజెలిస్.. హోస్టన్ లలో టీ 20 ఫార్మాట్ లో క్రికెట్ ఆడనున్నారు. ఈ సందర్భంగా పలువురు దిగ్గజ ఆటగాళ్లతో పాటు క్రికెట్ దేవుడు కూడా క్రీజ్ లోకి దిగనున్నాడు. బ్యాట్ పట్టుకొని క్రీజ్ లో కదం తొక్కే సచిన్ ను మరోసారి చూసే అవకాశం క్రికెట్ క్రీడాభిమానులకు దక్కనుంది.