Begin typing your search above and press return to search.

క్రికెట్ దేవుడి సెకండ్ ఇన్నింగ్స్ ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   19 July 2018 5:43 AM GMT
క్రికెట్ దేవుడి సెకండ్ ఇన్నింగ్స్ ఇదేన‌ట‌!
X
క్రికెట్ దేవుడిగా కీర్తించే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రిటైర్మెంట్ త‌ర్వాత ఆయ‌నేం చేస్తార‌న్న ఆస‌క్తి పెద్ద ఎత్తున వ్య‌క్త‌మైంది. ఈ విష‌యమై భారీగానే చ‌ర్చ సాగింది. అయితే.. ఎప్ప‌టిలానే తొంద‌ర‌ప‌డ‌ని స‌చిన్.. త‌న రిటైర్మెంట్ ప్లాన్ ను ఎప్పుడూ బ‌య‌ట‌పెట్టింది లేదు. క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఐదేళ్ల‌కు తాజాగా ఆయ‌న త‌న సెకండ్ ఇన్నింగ్స్ వివ‌రాల్ని బ‌య‌ట‌పెట్టారు.

తాజాగా ఆయ‌న క్రికెట్ అకాడ‌మీని స్టార్ట్ చేయ‌నున్నారు. మిడిల్ సెక్స్ క్రికెట్ తో క‌లిసి ఆయ‌న అకాడ‌మీని స్టార్ట్ చేయ‌నున్నారు. క్రికెట్ తో త‌న‌కున్న అనుబంధం నేప‌థ్యంలో భావి క్రికెట‌ర్ల‌ను త‌యారు చేసేందుకు వీలుగా త‌న పేరుతో క‌లిపి ఆయ‌న అకాడ‌మీ స్టార్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

టెందూల్క‌ర్ మిడిల్ సెక్స్ గ్లోబ‌ల్ అకాడ‌మీ పేరుతో (షార్ట్ క‌ట్‌ లో టీఎంజీఏ) వ‌చ్చే నెల (ఆగ‌స్టు)లో స్టార్ట్ చేయ‌నున్నారు. ఈ అకాడ‌మీ ద్వారా తొమ్మిదేళ్ల నుంచి ప‌ద్నాలుగేళ్ల లోపు బాల‌బాలిక‌ల‌కు స‌చిన్ స్వ‌యంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. ఈ అకాడ‌మీలో శిక్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన పాఠ్యాంశాల్ని ప‌లువురు దిగ్గ‌జ‌న క్రికెట్ నిపుణుల‌తో పాటు స‌చిన్ స్వ‌యంగా రూపొందించ‌నున్నారు.

ఆగ‌స్టు 6-9 మ‌ధ్య‌లో బ్రిట‌న్ లోని నార్త్ వుడ్ ప్రాంతంలోని మ‌ర్చంట్ టైల‌ర్స్ స్కూల్లో మొద‌టి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్నారు. అకాడ‌మీ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌హారాల‌న్నీ ముంబ‌యి కేంద్రంగా సాగ‌నున్నాయి. తొమ్మిది నుంచి ప‌ద్నాలుగేళ్ల వ‌య‌సున్న బాల‌బాలిక‌ల‌కు ఈ అకాడ‌మీలో క్రికెట్ శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. స‌చిన్ స్వ‌యంగా పాలు పంచుకుంటున్న ఈ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందే చిన్నారుల విష‌యంలో స‌చిన్ స్వ‌యంగా పాలుపంచుకోవ‌టంతో వారికి నైతికంగా.. మాన‌సికంగా పెద్ద అండ‌గా ఉంటుందంటున్నారు. ఈ అకాడ‌మీ దాదాపు వంద మంది క్రికెట్ క్రీడాకారుల‌కు స్కాల‌ర్ షిప్పుల‌తో ప్ర‌వేశాన్ని క‌ల్పించ‌నుంది. దీని కార‌ణంగా టాలెండ్ ఉండి ఆర్థికంగా ద‌న్ను లేని భావి క్రికెట‌ర్ల‌కు కొండంత అండ‌గా నిల‌వ‌నుంది.