అమిత్ షాకు స్వామియే శరణం..!

Sat Nov 17 2018 20:11:55 GMT+0530 (IST)

ఆయన రాజ్యసభ సభ్యుడు. అంతే కాదు ఓ జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. దేశంలో అన్ని రాష్ట్రాలలోను - కేంద్రంలోను తన పార్టీయే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తు కలలు కంటున్న నాయకుడు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా...భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు - రాజ్యసభ సభ్యుడు అమిత్ షా. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలసి భారతీయ జనతా పార్టీని తద్వారా హిందు సమాజాన్ని ఉద్దరించేందుకు నడుము బిగించినట్లుగా ప్రపంచానికి తెలియచేయాలి.ఇంతకీ విషమమేమిటంటే....కేరళలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించడం అనే అంశంపై అమిత్ షా నోరుజారుతున్నారు. రాజ్యంగ బద్దంగా వ్యవహరించాల్సిన రాజ్యసభ సభ్యుడు దానికి అతీతంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. పురుషులులాగే అన్ని వయసుల వారు అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా మార్చుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా రాజ్యంగాన్ని సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత న్యాయస్దానం తీర్పులను - ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. ఒక వేళ ఆ తీర్పులను వ్యతిరేకిస్తే ధర్మాసనానికి తిరిగి అప్పీలు చేసుకునే అవకాశమూ ఉంటుంది. శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో సుప్రీం కోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించాలనుకుంటోంది. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. దీనిని భారతీయ జనతా పార్టీ ఓ రాజకీయ ఎత్తుగడగా పరిగణిస్తోంది. మరోవైపు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఓ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించాల్సిన తీరుకు వ్యతిరేకంగా రాజ్యంగాన్ని కాలరాశారని ఈ వివాదంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా అమిత్ షాకు కలసి వస్తుందేమో కాని రాజ్యంగ స్పూర్తికి పూర్తి విరుద్దంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. అమిత్ షా తీరును పలువురు తప్పుబడుతున్నారు.