Begin typing your search above and press return to search.

అభ్యర్థులకు 'ఎస్' ఫీవర్

By:  Tupaki Desk   |   20 Nov 2018 10:59 AM GMT
అభ్యర్థులకు ఎస్ ఫీవర్
X
సినిమా ఇండస్ర్టీ తర్వాత అంత సెంటిమెంట్ ఎక్కువగా కనిపించేది రాజకీయ రంగంలోనే.. మిగతా సందర్భాల మాటెలా ఉన్నా.. ఎన్నికల వేళ అభ్యర్థుల పాట్లు చూడాల్సిందే.. తెలంగాణాలో అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రే విపరీతమైన మూఢ నమ్మకాల మనిషి.. ఏ పని చేయాలన్నా ఏదో ఒక యాగం జరపడం ఆయనకు ఆనవాయితీ.. ఈ దఫా ఎన్నికల ప్రచారానికి ముందు రోజు కూడా ఆయన రెండు పెద్ద యాగాలు చేసి కానీ మరీ బయల్దేరలేదు..ఈ సంగతి కాస్త పక్కన పెడితే.. నామినేషన్ల ఘట్టం ముగిసి తెలంగాణలో ఎన్నికలు మరీ దగ్గర పడ్డాయి. అన్ని పార్టీల్లో రెబల్స్ తో సహా అభ్యర్థులందరూ ఖరారై పోయారు.. ఎవరి శక్తి కొద్ది వారు ప్రచారంలో విజృంభిస్తున్నారు..

అయితే ఇదే సమయంలో ఎవరు చెప్పారో తెలీదు కానీ.. ఓ విషయం మాత్రం రాష్ర్టమంతా హాట్ టాపిక్కైంది.. ఒకరి నుంచి మరొకరికి పాకి ఇది మొత్తం అంటుకుంది.. అదేమంటే ఈ సారి ఎన్నికల్లో ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో మొదలయ్యే పేరున్న అభ్యర్థులంతా ఓటమి పాలవుతారంట.. ఇదెక్కడి జోస్యమని కొట్టి పారేస్తే.. దానికొక లాజిక్క్ - ఎవిడెన్స్ జోడించి మరీ వాదిస్తున్నారు.. గత ఎన్నికల్లో ఎన్ అనే అక్షరంతో పేరు మొదలైన వారంతా ఓటమి పాలయ్యారు. కావాలంటే పరిశీలించుకోండంటూ.. నాగం జనార్ధన్ రెడ్డి - నోముల నర్సింహయ్య.. ఇలా పేర్ల చిట్టా విప్పుతున్నారు.. అదే సెంటిమెంట్ ఈ దఫా కూడా ఫలిస్తుందని.. అయితే ఈ సారి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే అభ్యర్థులకు గండం తప్పదని అంటున్నారు.. ఇది ఒట్టి మూఢ నమ్మకమే అయినా.. అభ్యర్థుల్లో, వారి ఆప్తుల్లో మాత్రం బాగా కలకలం రేపుతోంది.. ఇంటి పేరు ఎస్ తో మొదలైతేనా? లేక పేరు ఎస్ తో మొదలైతేనా? అన్న ధర్మ సందేహం కూడా కొందరు వ్యక్తం చేశారు.. అన్నింటికీ మా దగ్గర జవాబుందన్నట్టు.. నామినేషన్ లో ఎలా నమోదు చేస్తారనే దానిని బట్టి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని సెలవిస్తున్నారు.. అంటే వనపర్తి టియారెస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నాడు.. ఆయన నామినేషన్ నిరంజన్ రెడ్డి సింగిరెడ్డి అని వేస్తే పర్లేదన్నమాట.. అలా కాకుండా ఇంటి పేరు ముందు పెడితే మాత్రం పరాభవం తప్పదని ఎగ్జాంపుల్ తో సహా చెబుతున్నారు.. ఏ మాత్రం బేస్ లేని అంశమైనా.. ఈ వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.. మరో రెండు -మూడు వారాల్లో ఫలితాలు రానున్నాయి.. అప్పటి కాని అసలు సంగతి తెలీదు.. ఒక వేళ కాకతాళీయంగా ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లే సెంటిమెంట్ ఫలిస్తే మాత్రం ఎవరూ ఏం చేయలేం..