Begin typing your search above and press return to search.

సెల‌బ్రిటీ ఫోటోలు హ్యాక్ చేసి దొరికిపోయాడు

By:  Tupaki Desk   |   28 Oct 2016 10:30 PM GMT
సెల‌బ్రిటీ ఫోటోలు హ్యాక్ చేసి దొరికిపోయాడు
X
సాంకేతిక‌త అండ‌గా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల్లో సెల‌బ్రిటీల‌కు ఎదుర‌వుతున్న చిక్కుల్లో మ‌రో కోణం తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చింది. స‌హ‌జంగానే సెల‌బ్రిటీలు అంటే ఉండే క్రేజ్ వేరు. ఇక వారి న‌గ్న ఫొటోలు అయితే... చెప్ప‌క్క‌ర్లేదు. అయితే అవి స్వ‌త‌హాగా బ‌య‌ట‌కు రావు కాబట్టి వాటిని ప‌ట్టుకునేంద‌కు అకౌంట్ల‌ను హ్యాక్ చేయ‌డం ఒక‌టే మార్గం. అలా సెల‌బ్రిటీల అకౌంట్లు హ్యాక్ చేసి - వాళ్ల న‌గ్న చిత్రాలు - వీడియోల‌ను దొంగ‌లించిన కేసులో నిందితుడు రియాన్ కొలిన్స్‌ కు పోలీసుల‌కు దొరికిపోయాడు. దీంతో అమెరికాలోని పెన్సిల్వేనియా కోర్టు 18 నెల‌ల జైలు శిక్ష‌ను ఖ‌రారు చేసింది.

2012 నుంచి 2014 మ‌ధ్య సుమారు ఆరు వంద‌ల మంది యూజ‌ర్‌ నేమ్‌ లు - పాస్‌ వ‌ర్డ్‌ ల‌ను కొలిన్స్ దొంగ‌లించాడు. త‌ద్వారా సెల‌బ్రిటీల ర‌హ‌స్య చిత్రాల‌ను హ్యాక్ చేశాడు. గూగుల్‌-యాపిల్ నుంచి ఈమెయిళ్ల‌ను పంపి సెల‌బ్రిటీల‌ను కొలిన్స్ బోల్తా కొట్టించి సుమారు 50 ఐక్లౌడ్‌ - 72 జీమెయిల్ అకౌంట్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లు ప్రాసిక్యూట‌ర్లు నిర్ధారించారు. కొలిన్స్ బాధితుల్లో హాలీవుడ్ సినీన‌టి జెన్నిఫ‌ర్ లారెన్స్‌ - కేట్ అప్ట‌న్‌ - స్కార్లెట్ జాన్స‌న్‌ - క్రిస్టిన్ డ‌న్ట్స్ ఉన్నారు. ఆ కేసును సెల‌బ్‌ గేట్‌ గా పిలుస్తున్నారు. నేర‌స్తుడు కొలిన్స్ న‌కిలీ ఈమెయిల్ అడ్ర‌స్‌ ల‌తో టాప్ స్టార్ల ఫోటోల‌ను సంపాదించి దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ట్లు అధికారులు తేల్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/