ఫిఫా గెస్టులతో సెక్స్ వద్దు

Thu Jun 14 2018 17:48:36 GMT+0530 (IST)

ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ కు రష్యా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రీడలు ఎక్కడ జరిగినా ఆ నగరాలు శృంగార వేదికలు అవుతుండటం ఈ మధ్య బాగా పెరిగింది. ఆ సమయంలో ఆయా నగరాల్లో కండోమ్ అమ్మకాలు వందల రెట్లు పెరుగుతుండటమే దీనికి ప్రత్యక్ష తార్కాణం. అయితే ఈ విషయంపై రష్యాకు చెందిన 70 ఏళ్ల కమ్యూనిస్టు ఎంపీ తమారా ఫ్లెత్నెవా సంచలన వ్యాఖ్యలు చేశారు. సాకర్ అతిథులతో సెక్స్ చేయొద్దని తన దేశపు యువతులకు ఆమె సూచనలు చేశారు. ఆమె కేవలం తన దేశపు అమ్మాయిలకు మాత్రమే ఈ సూచనలు చేయడం గమనార్హం. సాకర్ ప్రపంచకప్ జరిగినపుడు ఎన్నో దేశాల వారు మన దేశానికి వస్తారు. వాళ్లతో డేట్‌కు వెళ్లకండి. ఆ క్షణికావేశం మిమ్మల్ని కుంగదీయొచ్చు. మీ కెరీర్‌ను కూడా డైలమాలో పడేయొచ్చు. ఇతరు దేశపు తాత్కాలిక అతిథులతో శృంగార సంపర్కం మీ భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించింది.

విదేశీ అతిథులకు మీరు దగ్గరయినా పర్లేదు కానీ లైంగిక సంబంధాలు మాత్రం వద్దు. దానివల్ల మీకు పిల్లలు పుడితో ఆ పిల్లలు అనాథలు అవుతారు. లేదా మీరు సింగిల్ మదర్ అవుతారు. మీతో శృంగారం చేసిన అతిథులు మళ్లీ ఇక్కడికి వచ్చి ఆ పిల్లలను గాని మిమ్మల్ని గాని తీసుకెళ్లకపోవచ్చు. అది మీకు మంచిది కాదు. ఎందుకంటే ప్రపంచ కప్ ముగిశాక ఎవరి దారి వారిదే. ఇతర దేశస్థుల  ద్వారా పుట్టిన పిల్లలకు తల్లిగా ఉంటే మీకు మళ్లీ పెళ్లి అయ్యే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయని ఆమె వ్యాఖ్యానించారు.