Begin typing your search above and press return to search.

కారులో సెక్స్ చేసిన ఎంపీని చంపేసిన భర్త

By:  Tupaki Desk   |   2 Dec 2015 4:55 AM GMT
కారులో సెక్స్ చేసిన ఎంపీని చంపేసిన భర్త
X
విస్మయాన్ని కలిగించే ఈ వ్యవహారం పలు దేశాల వారికి కాస్త షాకింగ్ గానే ఉంది. రష్యాలో ఒక మహిళా ఎంపీ ఇటీవల కారు బాంబులో హతమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులు తీవ్రతరమైన నేపథ్యంలో పుతిన్ పార్టీకి చెందిన ఈ మహిళా ఎంపీ మరణం వెనుక తీవ్రవాద హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. ఈ కేసు విషయంలో రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబు దాడి వెనుకున్న కోణాన్ని వెల్లడించి విస్మయానికి గురి చేశారు.

కారులో బాంబు పేలి మరణించిన ఈ రష్యా ఎంపీ పేరు ఒక్సానా. ఆమె.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెందిన మునైటెడ్ పార్టీ సభ్యురాలు. ఆమె భర్త నికిట గతంలో సైన్యంలో పని చేశారు. ప్రస్తుతం భార్య సంపాదన మీదే కాలం గడుపుతున్నాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. సదరు మహిళా ఎంపీగారికి ఒక సంపన్న ప్రేమికుడు ఉన్నాడు. వారి మధ్య వివాహేతర సంబంధం ఉంది. తాజాగా కారులో బాంబు పేలి హతమైన సందర్భంలో కారులో ఈ మహిళా ఎంపీతో పాటు.. సదరు లవ్వర్ కూడా ఉన్నారు.

బాంబు పేలిన ఘటనలో వీరి ముఖాలు పేలిపోయాయి. అత్యంత భయానకంగా ఉన్న ఈ ఘటన సందర్భంగా ఇద్దరి ఒంటి మీదా బట్టలు లేకపోవటం.. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సైతం వీరిద్దరి మధ్య సెక్స్ జరిగిన తర్వాత చనిపోయారని తేలింది. కారులో సెక్స్ చేయటం.. ఆ వెంటనే బాంబు పేలి వీరిద్దరూ విగతజీవులైనట్లు రష్యా పోలీసులు భావిస్తున్నారు. తన భార్యకున్న వివాహేతర సంబంధంపై తీవ్రంగా రగిలిపోయిన మహిళా ఎంపీ భర్త.. ఆమెను హతమార్చారే తప్పించి ఈ కారు బాంబు వెనుక ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు లేవని తేల్చారు. మొగుడు.. పెళ్లాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఏమో కానీ.. వీరికున్న నాలుగేళ్ల పాప పరిస్థితేమిటన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక వివాహేతర సంబంధం విషయంలో ఒక మహిళా ఎంపీ దారుణంగా హత్యకు గురి కావటం సంచలనం సృష్టిస్తోంది.