ఈ మోడల్ పనిని అందరూ తిట్టిపోస్తున్నారు

Fri Feb 17 2017 22:24:46 GMT+0530 (IST)

పేరు ప్రఖ్యాతుల కోసం ఈ మధ్య కాలంలో తింగరి పనులు చాలానే చేస్తున్నారు. ఇలాంటి పనుల్నిప్రచారం చేసుకోవటానికి సోషల్ మీడియా చేతికి రావటంతో కోతికి కొబ్బరికాయ దొరినట్లుగా మారింది. సంచలనం కోసమో..పేరు ప్రఖ్యాతుల కోసం.. ఓవర్ నైట్ ప్రపంచం దృష్టిలో పడాలన్న అతృతతో కొందరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే.. ఔరా అనుకోవాల్సిందే. ఈ ప్రయత్నాల్లో కొందరు సక్సెస్ అవుతుంటే.. మరికొందరు దురదృష్టవంతులు తమ ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు.

తాజాగా ఒక రష్యా మోడల్ చేసిన పని.. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె చేసిన సాహసానికి ఎవరి గుండెలు అయినా జారిపోవాల్సిందే. అయితే.. ఇలాంటి సాహసం ఆమె ఎందుకు చేసిందంటే.. జస్ట్.. ప్రచారం కోసమనే చెప్పాలి. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే సాహసానికి పాల్పడిన ఈ సుందరి తీరును పొగిడే వారి కంటే తిట్టిపోసే వారే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసిందన్న విషయాల్లోకి వెళితే.. 22 ఏళ్ల రష్యా మోడల్ వికీ ఒడింట్కోవాకి సాహసాలు చేయటం సరదా. అంతేకాదు.. హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. తనను ఫాలో అయ్యేవారిని తన అందచందాలతో.. వయ్యారాలతో పిచ్చెక్కించేస్తుంది. మరిన్ని చిన్నెలు ఉన్న చిన్నదాన్ని దేశాలకు అతీతంగా ఫాలో అయిపోతుంటారు. ఇన్ స్టాగ్రామ్లో ఆమెకు లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ అందాల భామకు బుర్రలోనే కాదు.. ఒంటి నిండా సృజనాత్మకతే.

అందుకే కాబోలు.. తన ఒంటి అందాల్ని ఎంత సృజనాత్మకంగా చూపించాలో అంతా చూపించేస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సరదాగా ఒక సాహసం చేయాలని అనుకుంది. తాను పని చేసే యాడ్ ఏజెన్సీకి చెందిన లైవ్ బృందాన్ని తీసుకొని దుబాయ్ వెళ్లింది. అక్కడ.. 70అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని ఎంచుకొని.. దాని పై కొసన వేలాడుతూ ఫోటో దిగాలని డిసైడ్అయ్యింది.

ఇదెంత ప్రమాదకరమైన పీట్ ఏమిటంటే.. ఎలాంటి రక్షణా కవచాల్ని ధరించకుండా.. జస్ట్ తన చేతిని మరోస్టంట్ మాస్టర్ చేతికి పట్టేసుకొని.. 70 అంతస్థుల పైన వేలాడింది. ఈ ఫీట్ రికార్డు చేసే వారి సంగతి తర్వాత.. చూసే వారికి మాత్రం ఒంటినిండా చెమటలు పట్టే పరిస్థితి. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లోనూ.. యూట్యూబ్ లోనూ పెట్టేసింది. దీన్ని చూసినోళ్లంతా ఆమె సాహసాన్ని చూసి జడుచుకొని.. తిట్టిపోస్తున్నారు. మరింత ఛండాలం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందనా..సాహసం పేరుతో పిచ్చపిచ్చ పనులు ఎంతమాత్రం చేయొద్దని హెచ్చరించటానికే. బతికి ఉంది కాబట్టి సరిపోయింది. ఏ మాత్రం తేడా వస్తే.. ఏమిటి సంగతి..? ఆమె పోతే పోతుంది.. ఆమె కుటుంబం మాటేమిటి..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/