Begin typing your search above and press return to search.

అమెరికాను వ‌ణికించిన స‌బ్ మెరైన్ ఇదే!

By:  Tupaki Desk   |   27 July 2017 9:28 AM GMT
అమెరికాను వ‌ణికించిన స‌బ్ మెరైన్ ఇదే!
X
ప్ర‌పంచానికే పెద్ద‌న్న లాంటి అమెరికాను ఓ స‌బ్ మెరైన్ గ‌జ‌గ‌జ‌లాడించింది. త్రివిధ ద‌ళాల‌లో త‌మ‌కు సాటి లేర‌ని భావించే అమెరిక‌న్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించింది. కోల్డ్ వార్ స‌మ‌యంలో అమెరికాను ప్ర‌పంచంలోనే అతి పెద్ద స‌బ్ మెరైన్ దిమిత్రి డోన్ స్కోయ్ గ‌డ‌గ‌డ‌లాడించింది. వ‌చ్చే ఆదివారం ర‌ష్యాలో జ‌ర‌గ‌నున్న నేవీడేలో త‌న విన్యాసాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి ఈ భారీ స‌బ్ మెరైన్....నావ‌ల్ బేస్ కు వ‌చ్చింది.

రష్యా నేవీ దినోత్సవ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్ లోని క్రోన్డ్ స్టాడ్ లోని నావల్ బేస్ కు ఈ భారీ సబ్‌ మెరైన్ చేరుకుంది. నేవీ డే సందర్భంగా భారీగా ఆయుధసంపత్తిని ప్రదర్శించనుంది. 1359 నుంచి 1389 మధ్య మాస్కోను పాలించిన దిమిత్రి డోన్‌ స్కోయ్‌ పేరును ఈ సబ్‌ మెరైన్‌ కు పెట్టారు. దీని పొడవు 574 అడుగులు. స‌ముద్రం ఉప‌రితలంపై 22 నాటిక‌ల్ మైళ్లు - స‌ముద్రం లోప‌ల 27 నాటిక‌ల్ మైళ్ల వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌దు.

ఈ భారీ స‌బ్ మెరైన్ సముద్రంలో సుమారు 400 మీట‌ర్ల(1300 అడుగులు) లోతు వ‌ర‌కు ప్ర‌యాణించ‌గ‌ల‌దు. ఈ స‌బ్ మెరైన్ లో సుమారు 200 ప్ర‌మాద‌క‌ర‌మైన ఆయుధాలున్నాయి. టైఫూన్‌ క్లాస్‌ కు చెందిన ఈ సబ్‌ మెరైన్‌ ఒకేసారి 20 అణు టార్పెడోలను ప్రయోగించ గలదు. ఒక్కసారి సముద్రం లోపలికి వెళితే 120 రోజుల పాటు స్వేచ్ఛగా మనగలదు. ఈ స‌బ్ మెరైన్ లో 160 మంది సిబ్బంది ప‌నిచేస్తున్నారు.