ఫ్రెండ్ పెళ్లాం పరిచయం ఖరీదు 4.2లక్షల కోట్లా?

Fri Jan 11 2019 11:53:21 GMT+0530 (IST)

మీరు చదివింది నిజం. గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలోనూ.. అంతర్జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియాలోనూ ఒక వార్త అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ల కాలంలో అమెజాన్ అన్న సంస్థ అందరికి సుపరిచితం. మరి.. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు.. అపర కుబేరుడు.. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరు లాంటి బిరుదులు ఎన్నో ఉన్న పెద్ద మనిషి పేరు జెఫ్ బెజోస్.అలాంటోడికి ఒక భార్య కూడా ఉంది. ఆమెతో సంసారం ఏడాదో.. రెండేళ్లో కాదు.. ఏకంగా పాతికేళ్లు సంసారం చేశారు. అలాంటి బెజోస్ కు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడి పేరు ప్యాట్రిక్ వైట్సెల్. తన భార్య లారెన్ శాంచెజ్ ను పరిచయం చేశాడు. ఆమె.. ఫాక్స్ టీవీకి హోస్ట్ గా వ్యవహరిస్తుంటారు. తన స్నేహితుడి భార్య తో జరిగిన పరిచయం బెజోస్ లో కొత్త ప్రకంపనాల్ని సృష్టించింది.

అది కాస్తా.. చివరకు పాతికేళ్లుగా కలిసి ఉన్న భార్యకు విడాకులు ఇచ్చే వరకు వెళ్లింది. స్నేహితుడి పెళ్లాంగా పరిచయమైన ఆమె కోసం తన భార్యకు రూ.4.2లక్షల కోట్ల ఆస్తిని విడాకుల భరణంగా ఇచ్చేసి మరీ.. ఆమె కోసం తాను సింగిల్ స్టేటస్ ను అమెజాన్ వ్యవస్థాపకుడు పొందాడు. అపర కుబేరుడు స్నేహితుడి భార్యతో  తనకున్న ప్రేమాయణం కోసం ఇంత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.