Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల రిజ‌ల్ట్ స‌మాచార‌మా? ఈసీ యాప్ ఇదే!

By:  Tupaki Desk   |   23 May 2019 3:54 AM GMT
ఎన్నిక‌ల రిజ‌ల్ట్ స‌మాచార‌మా? ఈసీ యాప్ ఇదే!
X
సుదీర్ఘంగా సాగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు.. ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ రోజున విడుద‌ల కానున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల్ని వెల్ల‌డించేందుకు ప్ర‌తి మీడియా సంస్థ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. ఇక‌.. టీవీ ఛాన‌ళ్లు.. వెబ్ సైట్లు.. అనుక్ష‌ణం ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాలు తెలిపేందుకు ప్ర‌త్యేకంగా సిద్ధ‌మ‌య్యాయి. ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డించేందుకుకేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేకంగా ఒక యాప్ సిద్ధం చేసింది. దీని పేరు "సువిధ" యాప్.

ఈ యాప్ లో ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డిస్తారు. కాక‌పోతే ఒకే ఒక్క ఇబ్బంది ఏమంటే.. ఎన్నిక‌ల సంఘం అధికారిక యాప్ తో ఇబ్బందేమంటే.. ఓట్ల లెక్కింపున‌కు సంబంధించిన ప్ర‌తి రౌండ్ వివ‌రాల్ని అధికారికంగా ఓకే అయ్యాక మాత్ర‌మే వివ‌రాల్ని వెల్ల‌డిస్తారు. అంటే.. టీవీల్లో.. వెబ్ సైట్ల‌లో స‌మాచారం అందిన అర‌గంట త‌ర్వాత‌ మాత్ర‌మే ఎన్నిక‌ల సంఘం అధికారికంగా స‌మాచారాన్ని అప్డేట్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు.

క్ష‌ణాల మీద స‌మాచారం తెలుసుకోవాల‌ని త‌పించే వారు.. కాస్త కుడి ఎడ‌మైనా ఫ‌ర్లేదు అనుకునే వారికి ఈ యాప్ అస్స‌లు ప‌నికి రాదు. తాము చూసే స‌మాచారం మొత్తం ప‌క్కాగా ఉండాల‌ని భావించే వారికి మాత్రం ఈ యాప్ చ‌క్క‌గా సూట్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. ఓట్ల లెక్కింపు కేంద్రాల ద‌గ్గ‌ర ఫ‌లితాల్ని వెల్ల‌డించ‌టానికి ప్ర‌త్యేకండా డిస్ ప్లే బోర్డుల్ని ఏర్పాటు చేశారు. ప్ర‌తి ఐదు నిమిషాల‌కు ఒక‌సారి స‌మాచారం అప్డేట్ అవుతూ ఉంటుంది. సైబ‌ర్ సెక్యురిటీ నిబంధ‌న‌లను అనుస‌రించి.. కౌంటింగ్ కేంద్రాల‌కు పెన్ డ్రైవ్ లు.. సీడీలు తీసుకెళ్ల‌టానికి అనుమ‌తి ఇవ్వ‌రు. అదే విధంగా సెల్ ఫోన్ల‌ను కూడా లోప‌ల‌కు తీసుకెళ్ల‌నివ్వ‌రు.పోస్ట‌ల్ బ్యాలెట్లు.. రిజెక్ట్ చేసిన ఓట్ల వివ‌రాల్ని వెల్ల‌డించేందుకు వీలుగా డిస్ ప్లే బోర్డులో ఏర్పాట్లు చేశారు.