Begin typing your search above and press return to search.

సెటిల్‌ మెంట్ల సీఎంగా మారిన బాబు

By:  Tupaki Desk   |   27 March 2017 1:57 PM GMT
సెటిల్‌ మెంట్ల సీఎంగా మారిన బాబు
X
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన టీడీపీ ఎంపీ - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలపై విష‌యంలో అధికార పార్టీ అనుస‌రిస్తున్న వైఖ‌రిని ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఎండ‌గ‌ట్టింది. ఘోర రోడ్డు ప్ర‌మాదం ఘ‌ట‌న త‌ర్వాత నందిగామ ఆస్ప‌త్రి వ‌ద్ద వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ డాక్ట‌ర్ల‌తో చ‌ర్చించిన తీరును త‌ప్పుప‌ట్టిన అధికార పార్టీ...త‌మ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు సీనియ‌ర్ ఐపీఎస్‌ తో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని ఎలా స‌మ‌ర్థించుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. అధికార పార్టీ నేత‌ల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. ప్ర‌భుత్వ అధికారితో అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోకుండా ఎందుకు చ‌ర్చ‌లు జ‌రిపార‌ని నిల‌దీశారు.

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సెటిల్‌ మెంట్ల ముఖ్య‌మంత్రిగా మారిపోయార‌ని రోజా విమ‌ర్శించారు. గ‌తంలో ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడిచేసిన ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ విష‌యంలోనూ ఇలాగే రాజీ కుదిర్చార‌ని మండిప‌డ్డారు. గుంటూరు జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ జానీమూన్ సాక్షాత్తు కేబినెట్ మంత్రి త‌న‌ను ఇబ్బందుల పాలు చేస్తున్న విధానాన్ని పంచుకుంటే అక్క‌డా సెటిల్‌ మెంట్ చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రిపాల‌న వ‌దిలేసి ఇలా సెటిల్‌మెంట్ల‌కే ప‌రిమితం అవుతున్నార‌ని రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా, అసెంబ్లీ మీడియాపాయింట్‌ లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ చేసిన తప్పుకు సిగ్గుతో తలదించుకోవాల్సిందిపోయి టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగడం దుర్మార్గమని ఎధ్వజమెత్తారు. తన కొడుకు తప్పు చేస్తే ఎలాంటి పైరవీలు నడిపించుకోకుండా నిజాయితీగా అరెస్టు చేయండి అని చెప్పిన వ్యక్తి బాలసుబ్రమణ్యం అని కొనియాడారు. అలాంటి నిజాయితీగల అధికారిపై టీడీపీ ప్రజాప్రతినిధులు దాడులకు పాల్పడడం బాధాకరమన్నారు.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు కావాలనే కుట్రపూరితంగా క్రిమినల్‌ కేసులు పెట్టారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ అధికారులకు సారీ చెప్పలేదు అందుకే కేసు పెట్టారు. మేం చెప్పాం అందుకే కేసు పెట్టలేదు అంటూ ఎదురుదాడికి దిగడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేశినేని ట్రావెల్స్‌ను బంద్‌ చేస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల మాఫియా నడుస్తోందని ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేలు చెబితేనే పోలీసులు పనిచేయాలనే రీతిలో చంద్రబాబు ఆర్డర్స్‌ తీసుకొచ్చారని విమర్శించారు. పొలంలో నుంచి సిమెంట్‌ రోడ్డు వేస్తున్నందుకు ఎమ్మార్వోను ప్రశ్నిస్తే ఆమెతో బలవంతంగా తనపై కేసులు పెట్టించారని గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. పదివేల మంది ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడిస్తే అప్పుడు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి తనను విడుదల చేశారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరు ఎదురుతిరిగినా కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసి అణచివేయాలనే ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/