Begin typing your search above and press return to search.

బాల‌కృష్ణకో న్యాయం...ప‌వ‌న్ కో న్యాయ‌మా?:రోజా

By:  Tupaki Desk   |   20 April 2018 1:29 PM GMT
బాల‌కృష్ణకో న్యాయం...ప‌వ‌న్ కో న్యాయ‌మా?:రోజా
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి మండిప‌డ్డారు. చంద్ర‌బాబు చేస్తున్న‌ది ధ‌ర్మ దీక్ష కాద‌ని...ఆదో దొంగ దీక్ష అని రోజా ఎద్దేవా చేశారు. ధ‌ర్మ దీక్ష పేరుతో చంద్ర‌బాబు కేవ‌లం నిరాహార దీక్ష మాత్ర‌మే చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీఎంపీల చేత రాజీనామాలు చేయించి - ఇదే దీక్ష‌ను ఢిల్లీలో చేప‌ట్టి ఉంటే ఈ పాటికి ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌చ్చి ఉండేద‌ని రోజా అన్నారు. రూ.30 కోట్ల ప్రజాధ‌నాన్ని వృథాచేసి ఈ దీక్ష చేప‌డుతున్నార‌ని, సీరియ‌స్ గా దీక్ష చేసే వార‌యితే దీక్షా వేదిక‌పైన కామెడీగా ఎన్టీఆర్ డూప్ ను ఎందుకు పెట్టుకున్నార‌ని రోజా చ‌మ‌త్క‌రించారు. ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచి ఆయ‌న ఎమ్మెల్యేలు - ఎంపీల‌ను చంద్ర‌బాబు త‌న‌వైపుకు తిప్పుకొని అధికారంలోకి వ‌చ్చార‌ని - ఇపుడు ఓట్ల కోసం ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి న‌క్క‌విన‌యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని మండిప‌డ్డారు. బాబు చేప‌ట్టిన దీక్ష‌కు ఎల్లో మీడియా విస్తృతమైన క‌వ‌రేజీ ఇచ్చింద‌ని - వైసీపీ ఎంపీలు చేప‌ట్టిన నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌ల‌కు క‌వ‌రేజీ ఇవ్వ‌లేద‌ని అన్నారు.

ప్ర‌త్యేక హోదా రాష్ట్రానికి ఊపిరి వంటిద‌ని, అటువంటి ప్ర‌త్యేక హోదా అంశాన్ని కొన్ని చానెళ్లు డైవర్ట్ చేస్తున్నాయ‌ని  వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు. హిందూపురం ఎమ్మెల్యే - సినీ న‌టుడు బాల‌కృష్ణ గారు...అమ్మాయి క‌నిపిస్తే ముద్దుపెట్టండి - క‌డుపు చేయండి అంటే దానిపై డిస్క‌ష‌న్ కూడా ఉండ‌ద‌ని రోజా మండిప‌డ్డారు. ఎవ‌రైనా ఎస్సీలుగా పుట్టాల‌నుకుంటారా అని ఆయ‌న కామెంట్ చేస్తే ఎవ‌రూ చ‌ర్చించ‌ర‌ని అన్నారు. ఈ రోజు దీక్ష వ‌ద్ద కూడా బాల‌కృష్ణ చేసినవి మ‌తిలేని వ్యాఖ్య‌లని - ఆయ‌న‌కు మ‌తిపోయింద‌ని ఆమె ఎద్దేవా చేశారు. ఎక్క‌డ ప్ర‌జ‌లు వాళ్ల‌ను అస‌హ్యిచుకుంటారో, ఎక్క‌డ వాళ్ల‌కు చెడ్డ‌పేరు వ‌స్తుందో అని ఆ వార్త‌ల‌ను బ‌య‌ట‌కు రానివ్వ‌ర‌ని - ప్ర‌సారం చేయ‌ర‌ని రోజా నిప్పులు చెరిగారు. లేని విష‌యాల‌ను ఉన్న‌ట్లు చూపించ‌డం, కొన్ని విష‌యాల్లో జ‌గ‌న్ గారి మీద బుర‌ద జ‌ల్ల‌డం వంటివి బాగా చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. నిన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ గారిని మోసిన ఎల్లో మీడియా....ఈ రోజు ఆయ‌న‌కు వ్యతిరేకంగా బుర‌ద‌జ‌ల్ల‌డం మ‌నంద‌రం గ‌మ‌నిస్తూనే ఉన్నామ‌ని రోజా అన్నారు. ప్ర‌భుత్వాలు చేసే త‌ప్పుల‌ను ఎండ‌గ‌ట్టాల్సిన మీడియా, ప్ర‌జ‌ల‌కు స‌త్యాలు చెప్ప‌కుండా....చంద్ర‌బాబు ఇచ్చే తాయిలాల‌కు ఆశ‌ప‌డి, యాడ్ ల‌కు ఆశ‌ప‌డి ఈ రాష్ట్ర భ‌విష్య‌త్తును భ్ర‌ష్టుప‌ట్టించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని రోజా ప్ర‌శ్నించారు.