రోజా లాజిక్ వింటే.. బాబు గెలుపుపై డౌట్

Mon Mar 20 2017 14:14:20 GMT+0530 (IST)

ఫైర్ బ్రాండ్ రోజా మాటలు ఎంత సూటిగా.. మంట పుట్టేలా ఉంటాయి. సుత్తి లేకుండా సూటిగా.. క్లియర్ గా ఉండే మాటలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. తాజాగా వెలువడిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ అధికారపక్షం విజయం సాధించిన నేపథ్యంలో.. తెలుగు తమ్ముళ్లు సంతోషంగా అంతా ఇంతా అన్నట్లుగా ఉంది. అయితే.. ఈ గెలుపు ఒక గెలుపేనా? అన్న భావన రోజా చెప్పే మాటల్ని వింటే డౌట్ రాక మానదు. ఇంతకీ రోజా ఏం చెప్పారన్నది చూస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచిందని వ్యాఖ్యానించారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవటం వల్లే ఏపీలో కూడా కోట్లు ఖర్చు పెట్టి గెలిచారన్న ఆమె.. సింహం సింగిల్ గానే వస్తుందని.. ప్రజాక్షేత్రంలో గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

రూ.300 కోట్లు ఖర్చు చేసి ముగ్గురు ఎమ్మెల్సీలను గెలిచారన్న ఆమె.. గతంలో శిల్పా చక్రపాణి రెడ్డి 147 ఓట్లతో గెలిచారని.. ఐదుగురు ఎమ్మెల్యేలు మారిన తర్వాత ఆయన గెలుపు మెజార్టీ 57 ఓట్లకు తగ్గిందని.. మరీ.. టీడీపీ గెలిచినట్లా? ఓడినట్లా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నిజంగానే టీడీపీకి బలం ఉందన్నది నిజమే అయితే.. పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికల బరిలోకి దిగి.. గెలవగలరా? అంటూ సవాలు విసిరారు. గతంలో ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ డిపాజిట్లు కూడా కోల్పోయిందని.. ఆ విషయాన్ని మర్చిపోకూడదన్నారు. చరిత్ర మర్చిపోకూడదని.. ఎంపీటీసీలు.. జెడ్పీటీసీలను కొనుగోలు చేసి కొన్న ఓట్లతో గెలిచిన గెలుపు ఒక గెలుపేనా? అంటూ ఆమె సంధించిన ప్రశ్నాస్త్రాల్ని వింటే.. నిజమనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/