Begin typing your search above and press return to search.

సోనియా అల్లుడికి కోప‌మొచ్చిందిగా!

By:  Tupaki Desk   |   23 Aug 2017 11:31 AM GMT
సోనియా అల్లుడికి కోప‌మొచ్చిందిగా!
X
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబార్ట్ వాద్రా రెచ్చిపోయారు. గ‌తంలోనూ ఆయ‌న‌ను ప్ర‌శ్నించిన మీడియా ప్ర‌తినిధిపై... అది కూడా జాతీయ మీడియా ఏఎన్ ఐ ప్ర‌తినిధిపై రెచ్చిపోయి దుర్భాష‌లాడి కొట్ట‌డానికి మీద‌కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ఆ ఘ‌ట‌న‌పై జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయినా కూడా ఆయ‌న త‌న ఆగ్ర‌హాన్ని అణుచుకోలేక పోతున్నాడు. ఇప్పుడు కూడా అలాంటిది కాక‌పోయినా.. ప్ర‌భుత్వంపై మాత్రం విరుచుకుప‌డే సీన్ ఒక‌టి చోటు చేసుకుంది. ముఖ్యంగా రాజ‌స్థాన్‌ లో ఆయ‌న రియ‌ల్ బూం చేశార‌ని, అక్క‌డ కొన్ని కోట్ల విలువ చేసే భూముల‌ను త‌క్కువ మొత్తాల‌కు రాబ‌ట్టుకున్నార‌ని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అత్త‌గారి నేతృత్వంలోని ప్ర‌భుత్వాన్ని అడ్డు పెట్టుకుని ప్ర‌జ‌ల ఆస్తిని దోచుకున్నాడ‌ని విప‌క్షాలు విరుచుకుప‌డ్డాయి.

దీంతో ఈ విష‌యంపై ప్ర‌స్తుత రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం మొన్నామ‌ధ్య రాబ‌ర్ట్‌ పై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించింది. దీనిని త‌ట్టుకోలేని రాబ‌ర్ట్‌.. తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోతున్నారు. దీనినే ఆయ‌న బుధ‌వారం బ‌య‌ట‌పెట్టేసుకున్నారు. రాజ‌స్థాన్ స‌ర్కార్‌పై తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. తనను టార్గెట్‌గా చేసుకుని రాజస్థాన్‌ ప్రభుత్వం వేధిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూ కుంభకోణంలో తన ప్రమేయం ఉన్నట్టు ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని వాద్రా అన్నారు.

‘నన్ను ఎంతైనా వేధించండి...వెంటాడండి...ప్రాసిక్యూట్‌ చేసుకోండి..ఇలాంటి అసత్యాలు నిజాన్ని కప్పిపుచ్చలేవు’ అని రాబర్ట్‌ వాద్రా ఫేస్‌ బుక్‌ పోస్ట్‌ లో పేర్కొన్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వం తనపై సాగిస్తున్న కుట్రపూరిత ప్రచారంలో ఇది ఓ భాగమేనని ఆయన అన్నారు. ఇక‌, బికనీర్‌ భూ ఒప్పందంపై సీబీఐ విచారణకు రంగం సిద్దమవుతున్న క్రమంలో రాబర్ట్‌​ వాద్రా రాజస్థాన్‌ సర్కార్‌ పై విమర్శలు చేయ‌డం అంద‌రినీ ఆలోచించేలా చేసింది. మ‌రి రాబోయే రోజుల్లో ఈ విచార‌ణ ఊపందుకుంటే మ‌రెంత‌గా రెచ్చిపోతాడో చూడాలి.