Begin typing your search above and press return to search.

మోహ‌న్ బాబు ఇంట్లో చోరీ.. చేసింది వాళ్లేనా?

By:  Tupaki Desk   |   23 Feb 2019 8:54 AM GMT
మోహ‌న్ బాబు ఇంట్లో చోరీ.. చేసింది వాళ్లేనా?
X
టాలీవుడ్ సినీ రంగ ప్ర‌ముఖుడు.. సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు ఇంట్లో చోరీ జ‌రిగింది. మోహ‌న్ బాబు ఇంట్లో చోరీ జ‌రిగిన విష‌యాన్ని ఆయ‌న మేనేజ‌ర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. పెద్ద మొత్తంలో క్యాష్‌.. బంగారు ఆభ‌ర‌ణాలు పోయిన‌ట్లుగా పేర్కొన్నారు.

ఎంత మొత్తం డ‌బ్బులు పోయాయ‌న్న దానిపై స్ప‌ష్ట‌త లేకున్నా.. ల‌క్ష‌ల రూపాయిల న‌గ‌దు పోయిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంట్లో ప‌ని చేసే ప‌నిమ‌నిషి మీద‌నే అనుమానం ఉన్న‌ట్లుగా భావిస్తున్నారు. ఫిర్యాదును విచార‌ణ‌కు స్వీక‌రించిన పోలీసులు.. విచార‌ణ జ‌రుపుతున్నారు. దొంగ‌ల్ని ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు.

ఇటీవ‌ల కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప‌ని చేసే ప‌నిమనిషి సైతం ఇదే రీతిలో చోరీ చేయ‌టం. .పోలీసుల రంగ‌ప్ర‌వేశంతో ప‌ట్టుబ‌డ‌టం జ‌రిగింది. చాలాకాలంగా న‌మ్మ‌క‌స్తులుగా ఉంటున్న ప‌ని మ‌నుషులు దొంగ‌త‌నం చేయ‌టం.. వ‌రుస‌గా మ‌రో సినీ ప్ర‌ముఖుడి ఇంట్లో చోరీ చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం.