Begin typing your search above and press return to search.

అమరావతి రోడ్లు ఎలా ఉంటాయంటే..?

By:  Tupaki Desk   |   5 Oct 2015 4:21 AM GMT
అమరావతి రోడ్లు ఎలా ఉంటాయంటే..?
X
మరికొద్ది రోజుల్లో ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన జరగనుంది. దీనికి సంబంధించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు.. అమరావతికి సంబంధించిన పలు అంశాలను ఒక్కొక్కటిగా ఏపీ సర్కారు ఆవిష్కరిస్తోంది. తాజాగా అమరావతికి లోని రహదారుల వ్యవస్థ ఎలా ఉండనుందన్న విషయాన్ని వెల్లడించింది ఏపీ సర్కారు.

అమరావతిలో రోడ్లు అన్నీ ఒక దానికి మరొకటి సమాంతరంగా ఉండటం.. ఎక్కువగా మలుపులు లేని రోడ్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది. రాజధాని నగరంలో తొలుత మొదలయ్యేది రోడ్లు.. నీటి కాలువలకు సంబంధించిన పనులు ఓకేసారి మొదలవుతాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పక్కా డిజైన్ ను సిద్ధం చేసేశారు.

ఇక.. అమరావతిలో రోడ్ల వ్యవస్తను చూస్తే..

= ప్రధాన రహదారుల పొడవు314 కిలోమీటర్లు ఉంటాయి.

= రాజధానిలో 1 బై 1 కిలోమీటర్ల బ్లాకులుగా రోడ్లు నిర్మిస్తారు.

= 1బై1 కిలోమీటర్ల పొడవు.. వెడల్పుతో ప్రణాళిక ప్రకారం చతురస్రాకారంగా దాదాపుగా 121 గడులు ఉంటాయి.

= ‘‘వీ’’ ఆకారంలో మలుపు తిప్పిన చోట 1 బై 2 కిలోమీటర్ల రహదారి వస్తుంది.

= ఎక్స్ ప్రెస్ రోడ్లు రెండు మాత్రమే కొంచెం వంపు తిరిగి ఉంటాయి.

= గ్రిడ్ లో భాగంగా ప్రభుత్వం (ఆడ్మినిస్ట్రేషన్).. పర్యాటకం.. వైద్యం.. కోర్టులు.. క్రీడలు లాంటి 9 అంశాలకు ప్రాంతాలు వేర్వేరుగా ఉంటాయి.

= ఈ 9 ప్రాంతాల్ని కలిపే సువిశాల రహదారులను నిర్మిస్తారు.

= ఎక్స్ ప్రెస్ హైవే 64 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పట్టణ రవాణాకు రాజధాని కేంద్ర ప్రాంతంలో రవాణాకు ప్రధాన మార్గం ఇదే.

= దాదాపు 200 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మిస్తారు.

= ప్రధాన రహదారుల పొడవు 104 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు 165 అడుగుల వెడల్పుతో ఉండేలా డిజైన్ చేస్తున్నారు.

= ఉప రహదారులు 146కిలోమీటర్ల పొడవుతో ఉంటాయి. వీటిని 130 అడుగుల వెడల్పుతో నిర్మిస్తారు.

= రాజధానిలో సబ్ రోడ్లు 80.. 60.. 40 అడుగుల వెడల్పుతో ఉండేలా ఏర్పాటు చేస్తారు. వంపులు చాలా చాలా తక్కువగా ఉంటాయి.

= వీటితో పాటు బీఆర్టీఎస్.. మాన్ ర్యాపిడ్.. ఎల్ఆర్టీఎస్ లాంటి రవాణా వ్యవస్థలు ఉంటాయి.

= కృష్ణా నదికి సమాంతరంగా పాలవాగు..కొండవీటి వాగుల్ని కలుపుతూ అడ్డంగా ఆరు కాలువలు వస్తాయి.

= రాజధాని చుట్టూ 450 కిలోమీటర్ల పరిధిలో వర్షం నీరు రాజధాని మీదుగా కృష్ణా నదిలోకి వెళ్లేలా చేస్తారు.

= రాజధానిలో 9 థీమ్ సిటీలను ఏర్పాటు చేస్తారు.

= ఇందులో మూడు ప్రాంతీయ వాణిజ్య కేంద్రాలు ఉంటాయి.

= బేతంపూడి దగ్గర మొదటిది.. వెంకటాపాలెం..కృష్ణయ్యపాలెం.. ఉండవల్లి గ్రామాల మధ్య రెండోది.. తుళ్లూరు వద్ద మూడో కేంద్రం ఉంటుంది.

= రాజధానికి సంబంధించిన లోగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

= ఈ విషయంలో ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోరుతోంది.

= అమరావతి శంకుస్థాపనకు చక్కటి లోగో తయారు చేసిన వారికి మంచి బహుమానం ఇవ్వనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించిందిజ

= రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు డిసెంబరు లోపు ప్లాట్లు ఇవ్వనుననారు.

= లేఔట్లను వేసి.. రైతులకు రావాల్సిన ఫ్లాట్లను కేటాయిస్తారు.

= రైతుల ఆలోచనల్ని దృష్టిలో ఉంచుకొని పక్కా వాస్తుతో కూడిన ఫ్లాట్లు ఇస్తారు.

= వాస్తులో తేడా వస్తే రైతులు భారీగా నష్టపోనున్న నేపథ్యంలో పక్కాగా చర్చలు జరిపి ఫ్లాట్లను రైతులకు అందిస్తారు.

= పర్యాటకం హబ్ గా ఉండవల్లి.. హెల్త్ హబ్ గా కృష్ణయ్యపాలెం.. ఎలక్ట్రానిక్స్ హబ్ గా బేతంపూడి ఉంటాయి.

= టెక్నాలజీ హబ్ గా శాఖమూరు నుంచి రాజధాని సరిహద్దుల వరకూ.. ఎడ్యుకేషన్ హబ్ గా ఐనవోలు నుంచి రాజధాని సరిహద్దుల వరకు ఉంటుంది.

= కోర్ సర్కారు మొత్తం రాయపూడి.. కోర్టుల నేలపాడుకు సమీపంలో.. స్పోర్ట్స్ అబ్బరాజుపాలెంలో ఉండనున్నాయి.

= దేవాదాయం అనంతవరానికి కొద్ది దూరంలో.. ఫైనాన్షియల్ సెంటర్లు తెల్లాయపాలెం.. ఉద్దండరాయుని పాలెం మధ్య ఏర్పాటు చేస్తారు.