Begin typing your search above and press return to search.

తెదేపాలోకి నాగం : ఆ కీలకనేతకు ఇష్టంలేదుట!!

By:  Tupaki Desk   |   5 Oct 2015 8:29 PM GMT
తెదేపాలోకి నాగం : ఆ కీలకనేతకు ఇష్టంలేదుట!!
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ఇప్పుడు తెరవెనుక ముమ్మరంగా నడుస్తోంది. పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించి నాయకుల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో ఒకప్పుడు ఎంతో కీలక నాయకుడిగా ఉండి, ఆ తర్వాత.. తన సొంత పార్టీ పెట్టుకుని, ఆ తర్వాత కూడా తిరిగి తెలుగుదేశం లోకి రాలేక, భాజపా తీర్థం పుచ్చుకున్న నాగం జనార్దనరెడ్డి ప్రస్తుతం మళ్లీ ఓ స్వతంత్ర వేదిక మీదే ఉన్నారు. మరో రకమైన మాటల్లో చెప్పుకోవాలంటే.. ఏ పార్టీలోనూ లేకుండా.. ఖాళీగా ఉన్నారని అర్థం.

బచావో తెలంగాణ అనే మిషన్‌ను స్థాపించి దాని ద్వారా తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్‌ సర్కారుతో పోరాడే కార్యక్రమంలో ఆయన బిజీగా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో వినిపిస్తున్న గుసగుసలను బట్టి.. నాగం జనార్దనరెడ్డి తిరిగి తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారుట. దీనికి సంబంధించి పార్టీ అధినేతకు, ఇతర కీలక నాయకులకు సంకేతాలు కూడా పంపించారుట. నిజానికి పార్టీలు వీడినప్పుడు, చీలినప్పుడు ఆయన చంద్రబాబును ఎన్నయినా తిట్టి ఉండొచ్చు గానీ.. తిరిగి వస్తానంటే. చంద్రబాబు వద్దనే పరిస్థితి లేదు. తెలంగాణలో అసలే పార్టీ పరిస్థితి కనాగష్టంగా ఉన్న నేపథ్యంలో.. ఎవరు వచ్చినా చేర్చుకునే స్థితిలోనే బాబు ఉన్నారు.

చంద్రబాబు నుంచి ఇంచుమించు గ్రీన్‌ సిగ్నల్‌ ఉన్నది గానీ. పార్టీలోని ఒక తెలంగాణ కీలకనేత మాత్రం నాగం పునరాగమనాన్ని ఇష్టపడడం లేదుట. ఆయన మరెవ్వరో కాదు. ప్రస్తుత పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి. వీరిద్దరూ ఒకే జిల్లాకు చెందిన నాయకులు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు. పైగా నాగం వస్తే గనుక, రేవంత్‌ కంటె సీనియర్‌ మరియు దూకుడు ఉన్న నాయకుడుగా గుర్తింపు తెచ్చుకోగలరు. రేవత్‌కంటె సబ్జెక్ట్‌ నాలెడ్జి ఉన్న నాయకుడు కూడా! ఆయన పార్టీలోకి వస్తే.. సామాజిక వర్గ సమీకరణలు, జిల్లా నాయకత్వాల పరంగా తన ప్రాధాన్యం తగ్గుతుందనే భయం రేవంత్‌ లో ఉన్నదిట. అందుకే ఆయన వెనుక్కు రావడానికి అడ్డు పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెదేపా అధికారంలోకి రాగలిగితే.. రెడ్డి వర్గం నుంచి సీఎం కావడానికి తను తప్ప మరో గత్యంతరం లేదని ఇన్నాళ్లూ అనుక్ను రేవంత్‌, నాగం వస్తే.. ఆ కోణంలో కూడా పోటీ తప్పదని కూడా అనుకుంటూ ఉండవచ్చా... ఏమో మరి??!!