Begin typing your search above and press return to search.

క్లారిటీ ప్లీజ్: రేవంత్ మీరు కాంగ్రెస్సా.. టీడీపీనా?

By:  Tupaki Desk   |   21 Feb 2019 7:57 AM GMT
క్లారిటీ ప్లీజ్: రేవంత్ మీరు కాంగ్రెస్సా.. టీడీపీనా?
X
రాజ‌కీయ నాయ‌కుడు అన్న త‌ర్వాత పార్టీ మార‌టం ఇవాల్టి రోజుల్లో చాలా కామ‌న్ అంశం. ఒక‌ప్పుడు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీ మార‌టం అంటే ఎంతో చ‌ర్చ‌.. ఆ త‌ర్వాత ర‌చ్చ జ‌రిగేది. కానీ.. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఒక నేత ఒక పార్టీలో ఉండి.. త‌ర్వాతి గంట‌లో మ‌రో పార్టీలోకి సింఫుల్ గా మారిపోతున్న ప‌రిస్థితి. సిద్ధాంతాలు.. విలువ‌ల మాటే విన‌పించ‌ని దుస్థితి.

ఇదిలా ఉంటే.. ఒక పార్టీ నుంచి వెళ్లిపోయి.. మ‌రో పార్టీ తీర్థం పుచ్చుకున్న త‌ర్వాత పాత పార్టీ గురించి.. ఆ పార్టీ అధినేత గురించి అయితే విమ‌ర్శ‌లు లేదంటే ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. కానీ.. రేవంత్ భ‌య్యా తీరుమాత్రం కాస్త భిన్నం. తాను వ‌దిలేసిన పార్టీని.. ఆ పార్టీ అధినేత వ‌క‌ల్తా పుచ్చుకున్న‌ట్లుగా మాట్లాడి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. కుట్ర పూరితంగా కేసీఆర్ స‌ర్కారును కూల‌దోసేందుకు ప్లాన్ వేయ‌టం.. అది కాస్త బెడిసి కొట్టి.. కెమేరా కంటి సాక్షిగా అడ్డంగా బుక్ అయిన రేవంత్‌.. త‌ర్వాతి ద‌శ‌ల్లో సీబీఐ.. ఐటీ విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఓటుకు నోటు విష‌యంలో గ‌డిచిన రెండు రోజులుగా ఈడీ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న రేవంత్ బుధ‌వారం ఏడున్న‌ర గంట‌ల పాటు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. విచార‌ణ అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను వీడిపోయి వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

ఓటుకు నోటు కేసులో బాబును ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. ఈడీ విచార‌ణ అదే రీతిలో సాగుతుంద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. రెండు రోజుల విచార‌ణ‌లో చంద్ర‌బాబును టార్గెట్ గానే ప్ర‌శ్న‌లు వేశార‌న్నారు. కేంద్రం కేసీఆర్ భుజం మీద నుంచి తుపాకీ పెట్టి చంద్ర‌బాబును కాల్చాల‌ని చూస్తుంద‌ని ఆరోపించారు.

2015లో ఏసీబీ పెట్టిన కేసును ఈడీ విచారిస్తోంద‌ని.. ఈడీ అధికారుల‌పై ఒత్తిడి ఉన్న కార‌ణంగా అడిగిన ప్ర‌శ్న‌ల్నే అడుగుతున్నార‌ని.. త‌న‌ను వేధిస్తున్న‌ట్లు చెప్పారు. పార్టీ మారిన రేవంత్ కు.. బాబు అదే ప‌నిగా గుర్తుకు రావ‌టం.. బాబుకు ఏదో జ‌రుగుతుంద‌న్న బాధ చూస్తుంటే.. రేవంత్ జీ.. మీరుప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ది ఏ పార్టీ అంటారు?