Begin typing your search above and press return to search.

కెసిఆర్ భయపడ్డాడు, రేవంత్ బయపెట్టాడట!

By:  Tupaki Desk   |   17 Jan 2018 4:00 AM GMT
కెసిఆర్ భయపడ్డాడు, రేవంత్ బయపెట్టాడట!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేత‌, కొడంగ‌ల్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ‌ర్గం కొత్త ప్ర‌చారం మొద‌లుపెట్టింది. తమ వ్యూహానికి ప్ర‌భుత్వం బెదిరింద‌ని వ్యాఖ్యానిస్తోంది. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం తలవంచింద‌ని ప్ర‌చారం చేస్తోంది. ఇందుకు పండ‌గ‌పూట తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన చ‌ర్య‌ను ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే...పండగ రోజున ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్ద‌కు దగ్గరకు మంత్రి మహేందర్ రెడ్డి, ఆయ‌న సోద‌రుడు అయిన ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా పెండింగ్ ప‌నుల గురించి ప్ర‌స్తావించారు. రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్న కొడంగ‌ల్‌లోని కోస్గి బస్ డిపో, ఫైర్ స్టేషన్ ఏర్పాటు విష‌యంలో సీఎం కేసీఆర్ వెంట‌నే వాటికి ఆమోదం తెలిపేశారు. ఆ మేర‌కు అధికారులు ఉత్త‌ర్వులు ఇచ్చేశారు. అయితే ఇది త‌మ విజ‌య‌మ‌ని రేవంత్ వ‌ర్గం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేస్తోంది. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధ‌మ‌వ‌డ‌మే ఆఘ‌మేఘాల మీద అనుమ‌తుల‌కు కార‌ణ‌మ‌ని ప్ర‌క‌టిస్తోంది.

రేవంత్‌ కొడంగల్ కు సాధించిన బస్ డిపో, ఫైర్ స్టేషన్, జూనియర్ కాలేజి లు, సిమెంట్ కంపెనీ, ఇలా చాలా వాటిని ప్రభుత్వం అడ్డుకుంది. వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సంక్రాంతి తరువాత నియోజకవర్గం లో 5 మండలాలను కలుపుతూ రేవంత్ పాదయాత్ర చేయాలని ప్లాన్ చేయడంతో కేసీఆర్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని ,అందుకే వెంట‌వెంట‌నే అనుమ‌తులు ఇచ్చేశార‌ని అంటున్నారు. ఎంత మందిని కొన్న‌ప్ప‌టికీ.... ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినప్ప‌టికీ రేవంత్ సామ్రాజ్యాన్ని కనీసం కదిలించలేక పోతున్నామ‌ని భావించి పాదయాత్ర చేస్తే నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు తిరగలేరు అని గ్రహించిన స్థానిక గులాబీ నేతలు సీఎం వ‌ద్ద‌కు తామే ఇవన్నీ సాధించినట్లు ప్రజలకు విశ్వాసం కలిగించాలని ప్రయత్నం చేశార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో రేవంత్ పాదయాత్ర దెబ్బకు కేసీఆర్‌కు మైండ్ బ్లాంక్ అయ్యింది అని రేవంత్ రెడ్డి వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. మొత్తంగా అభివృద్ధి ప‌నుల‌ను సైతం...రాజ‌కీయాలు వ‌దిలిపెట్ట‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు