రేవంత్ రెడ్డి స్పందన విన్నారా?

Tue Dec 11 2018 12:34:34 GMT+0530 (IST)

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు మరో అవకాశం ఇచ్చారు. ఫలితాలు ఎలా ఉన్నా మేము తెలంగాణలో ప్రజా తీర్పును గౌరవిస్తాం. ఇప్పటికైనా కేసీఆర్ ఇప్పటికైనా ఫామ్ హౌజ్ కు పరిమితం కాకుండా సెక్రటేరియెట్ కు వచ్చి పాలించాలని కోరుతున్నాం. ఎవరినీ విస్మరించకుండా అందరినీ ఆదరించాలి. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కోరారు.**ఫలితాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ ప్రజల వెంట ఉంటుంది. బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు - సూచనలు ఇస్తాం. ప్రజల సమస్యలు - ప్రభుత్వ నిర్ణయాల్లోని లోపాలను ఎత్తిచూపుతాం. ఓడిపోతే కుంగిపోం... గెలిస్తే ఉప్పొంగిపోము. గెలిస్తే ప్రజలు మామీద బాధ్యత పెటినట్లు. ఓడిపోతే ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత అప్పగించినట్లుగా భావిస్తాం. టీఆర్ ఎస్ కు ప్రజలు ఇచ్చిన తీర్పు దోచుకోవడానికి కాదు - కుటుంబ పాలనను అంగీకరించినట్లు కూడా కాదు.. ప్రజలకు మంచి చేయండి** అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అమరు వీరుల విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం నిజమేనని ఇప్పటికైనా వారి కుటుంబాలను గుర్తించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఉద్యమకారుల మీద కేసులను ఎత్తివేయాలన్నారు. నిరుద్యోగ యువత కోసం వీలైనంత త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని సూచించారు. పూర్తిస్థాయి ఫలితాలు చూసి ఓటమిని విశ్లేషించుకుంటామన్నారు.