Begin typing your search above and press return to search.

సినిమావాళ్లకు బాధ్యత లేదా అంటున్న రేవంత్

By:  Tupaki Desk   |   6 Oct 2015 8:51 AM GMT
సినిమావాళ్లకు బాధ్యత లేదా అంటున్న రేవంత్
X
మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్ని ఆదుకునేందుకు సీనియర్ నటుడు నానా పటేకర్ ముందుకు రావడం.. ఆ తర్వాత అక్షయ్ కుమార్ సహా మరికొందరు తారలు తమవంతుగా తోడ్పాటు అందించడం తెలిసిందే. ఇదే తరహాలో మన తెలుగు సినిమా తారలు కూడా తెలంగాణ రైతులకు తోడ్పాటు అందించడానికి ముందుకు రావాలని అంటున్నాడు తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు - ప్రజా సంఘాలు వారిని ఆదుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ బస్సు యాత్రకు ప్రణాళిక రూపొందించింది. భాజపా నాయకుల్ని కూడా కలుపుకుని తెదేపా నాయకులు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్ని సందర్శించబోతున్నారు. వారిని ధైర్యం చెప్పి.. ఆర్థిక సాయం కూడా అందించబోతున్నారు.

ఈ నేపథ్యంలో సినీ తారలు కూడా రైతుల్ని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించి.. ముందుకు రావాలని అంటున్నాడు రేవంత్. మిగతా ఇండస్ట్రీలు రైతుల్ని ఆదుకుంటుండటం చూశాకైనా మన సినీ తారలు స్పందించాలని.. వాళ్లు ముందుకొస్తే ఉమ్మడిగా రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు రేవంత్. మరి మన సినీ తారల్లో ఎంతమంది దీనిపై స్పందిస్తారో చూడాలి.