Begin typing your search above and press return to search.

రాజీనామాపై వెనక్కి తగ్గిన రేవంత్‌ రెడ్డి!

By:  Tupaki Desk   |   20 Feb 2018 6:08 AM GMT
రాజీనామాపై వెనక్కి తగ్గిన రేవంత్‌ రెడ్డి!
X
కాంగ్రెస్ నేత‌ - ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా ముద్ర‌ప‌డిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిపై కొత్త ప్ర‌చారం తెర‌మీద‌కు వ‌చ్చింది. భారీ కామెంట్ల‌కు పెట్టింది పేర‌యిన రేవంత్ రెడ్డి త‌న స‌వాల్‌కు క‌ట్టుబ‌డి లేర‌ని - తోక‌ముడిచార‌ని అధికార టీఆర్ ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ తాజాగా అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్షమవ‌డంపై ఈ విమ‌ర్శ‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. మంత్రి జూపల్లితో కలిసి పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన‌డంతో రేవంత్‌ ది రాజీడ్రామానే అని తేలిపోయిందని అంటోంది.

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తున్న స‌మయంలో టీడీపీతో పాటుగా ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాననీ రేవంత్ ప్ర‌క‌టించారు. వేతనం - నివాసం - గన్‌ మెన్లు కూడా వద్దంటూ సోషల్‌ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. నవంబర్‌ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటూ ప్రకటించారు. తనకు జీతం వద్దని ఎమ్మెల్యే క్వార్టర్‌ ను కూడా ఖాళీ చేస్తున్నట్టు శాసనసభ కార్యదర్శికి చెప్పారు. చివరకు అసెంబ్లీలో ఉండే బ్యాంకు ఖాతాను కూడా మూసేశారు. గన్‌ మెన్ లను సరెండర్ చేశారు. అయితే తాజాగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయన అనుచరులు షాకయ్యారని అంటున్నారు. భారీ ప్ర‌క‌ట‌న‌లు చేసిన రేవంత్ ఇంతలోనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం విమర్శలకు తావిస్తున్నది.

నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి రేవంత్‌ రెడ్డి ఖిన్నుడైనట్టు అనుచరులే చెబుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షగా ఉన్న బస్‌ డిపో - ఫైర్‌ స్టేషన్ మంజూరు కావడం - పంచాయతీరాజ్‌ శాఖ రూ.20కోట్లతో రోడ్లు వేయడం తదితర అభివృద్ధి కార్యక్రమాలతో రేవంత్‌ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురైనట్టున్నార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. రేవంత్ వైఖరిని సొంతకార్యకర్తలనే తప్పు పడుతున్నారని చ‌ర్చ జ‌రుగుతోంది.