Begin typing your search above and press return to search.

పాపం రేవంత్ రెడ్డి..

By:  Tupaki Desk   |   17 Nov 2018 3:30 PM GMT
పాపం రేవంత్ రెడ్డి..
X
కింద పడినా పై చేయి నాదేననే రకం రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్ళొచ్చినా.. ఇంకా తాను నిర్దోషినని బుకాయించుకోగల తెంపరి రేవంత్ రెడ్డి.. తెలుగుదేశంలో ఉన్నా.. ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నా.. కేసియార్ విషయంలో ఇంచు కూడా తగ్గకుండా దాడులు చేస్తూనే ఉన్నాడు.. ఇన్నాళ్ళు గడిచిపోయిందేదో గడిచిపోయింది.. ఇప్పుడే అసలు సమస్య మొదలైంది.. కేసియార్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రచారం చేస్తున్న రేవంత్ ను అసలు అసెంబ్లీలోకే అడుగు పెట్టనీయరాదంటూ గులాబీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఓ పక్క కూటమిలో ప్రముఖుడిగా.. ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న రేవంత్ రెడ్డి కూటమి వియజం కోసం పడరాని పాట్లు పడుతున్నాడు..

మరో వైపు తన నియోజకవర్గంలో ప్రచారానికి సైతం దూరమవుతున్నాడు.. ఎంత తన సీటు మీద నమ్మకమున్నా.. తన నియోజకవర్గ ప్రజల మీద విశ్వాసమున్నా.. అవతల ప్రత్యర్థి పార్టీ గట్టి క్యాండిడేట్ నే పోటీగా నిలబెట్టింది.. దీనికి తోడు ట్రబుల్ షూటర్, ఎన్నికల వ్యూహాల్లో నిష్ణాతుడైన హరీష్ రావుకు కొడంగల్ లో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కట్టబెట్టింది. మామ కేసియార్ ఓ పని చెప్పిండంటే దాన్ని సక్సెస్ చేసే దాకా నిద్రపోని హరీష్ రావు.. తాజాగా కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించే పనిలో పూర్తి స్థాయి నిమగ్నమైనట్టు వార్తలందుతున్నాయి. చాపకింద నీరులా తన వ్యూహాలను అమలు చేస్తున్నట్లు సమాచారం.. పాపం రేవంత్ రెడ్డి పార్టీకి ప్రచారం చేసుకుంటూ తన సొంత స్థానానికి కనీస టైమ్ కూడా కేటాయించలేకపోతున్నాడు.. ఎంతో అప్రమత్తంగా ఉంటే తప్ప గెలవటం సాధ్యం కానీ ఈ రోజుల్లో మరి రేవంత్ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి మరి..