Begin typing your search above and press return to search.

అవన్నీ చిల్లర సర్వేలంటూ రేవంత్ ఫైర్

By:  Tupaki Desk   |   22 Oct 2016 1:49 PM GMT
అవన్నీ చిల్లర సర్వేలంటూ రేవంత్ ఫైర్
X
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తమ ఓటు తెరాసకే అంటూ తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సుమారు 109 నియోజకవర్గాల ప్రజలు ముక్తకంఠంతో నినదించారు! ఇదీ.. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే సారాంశం! ఈ సర్వేపై రకరకాల కామెంట్స్ వినిపిస్తోన్న తరుణంలో... తాజాగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఈ సర్వే చేసిన సంస్థ - ఆ సర్వేని ప్రసారం చేసిన టీవీ చానల్ - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శల వర్షం కుర్పించారు.

సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ కేసీఆర్‌ జేబు సంస్థ - సరదు చానల్ ప్రసారం చేసిన ఆ సర్వే చిల్లర సర్వే అని టిటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంకా ఈ విషయాలపై స్పందించిన రేవంత్... "సర్వేలు నిర్వహించేటప్పుడు ఆ సర్వే నిర్వహించే సంస్థ నిబద్దత - నేపథ్యాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ప్రభుత్వ పరిపాలనపై కానీ, ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలిపై గానీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అనుకుంటే ప్రధానమైన ప్రశ్నలను ఆ సర్వేల్లో పొందుపరుస్తారు. కానీ తాజాగా సర్వే చేసిన సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ అనేది కేసీఆర్‌ జేబు సంస్థ కాబట్టి అలాంటివేమీ లేవు" అని అన్నారు. నిజంగా టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, జీహెచ్‌ ఎంసీలో వంద కోట్ల స్కాం - హైదరాబాద్‌ లో రోడ్డ దుస్థితిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తానని అన్నారు కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ ఆ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించలేదని... అంత ముఖ్యమైన విషయాలను సర్వేల్లో పొందుపరచాలని, వాటిపై ప్రజాబ్యాలెట్ నిర్వహించాలని రేవంత్ అన్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కు సంబందించి విధ్యార్థుల వద్ద సర్వే చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇలాంటి వాస్తవ ప్రజాప్రయోజన విషయాలపైనా, ఎన్నికల సమయంలో తెరాస పార్టీ ఇచ్చిన మేనిపెస్టో పైనా ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తే... కేసీఆర్ పాలన ఎంత సువాసనలు వెదజల్లుతుందో, ఎంత జనరంజకంగా ఉందో తెలుస్తుందని... తాను డిమాండ్ చేస్తున్నట్లు నిర్వహించడానికి టీఆర్ ఎస్ భవన్‌ ఆఫీసు ముందు అయినా, సీఎం క్యాంపు ఆఫీస్‌ ముందున్న రోడ్లపై అయినా ప్రజా బ్యాలెట్‌ కు సిద్ధమా? అని అధికార పార్టీకి సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/