Begin typing your search above and press return to search.

ప్ర‌గతిభ‌వ‌న్ ద‌గ్గ‌ర డ్రంకెన్ డ్రైవ్ ఎందుకు పెట్ట‌రు?

By:  Tupaki Desk   |   15 Jun 2018 4:40 AM GMT
ప్ర‌గతిభ‌వ‌న్ ద‌గ్గ‌ర డ్రంకెన్ డ్రైవ్ ఎందుకు పెట్ట‌రు?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై కాంగ్రెస్‌ నాయకుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. రేవంత్ త‌న స‌హ‌జ‌శైలిలోనే కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసిన‌ప్ప‌టికీ...అవి రాజ‌కీయ విమ‌ర్శ‌ల స్థాయిలో లేవ‌ని..రేవంత్ స్థాయిని దిగ‌జార్ఏలా ఉన్నాయ‌ని ప‌లువురు అంటున్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీలో అవినీతిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాగి వాహనాలు నడుపుతున్న వారిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి జైల్లో పెడుతున్న పోలీసులు.. పీకల దాకా తాగి ప్రగతిభవన్‌లో ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం కేసీఆర్‌పై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్‌ పార్టీ కండువా కప్పుకున్నోళ్ల కిడ్నీలమ్మే రకం విమర్శించారు.

ఉద్యమాలు, ఆందోళనలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని మరిచిపోయారని రేవంత్ విమర్శించారు. ఇప్పుడు సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్న వారిని అరెస్టులు, బైండోవర్లు చేయడం వంటి అణచివేతలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీ గొర్రెలు రీసైక్లింగ్‌ చేసినవేనని వెటర్నరీ డాక్టర్‌ మొదలుకుని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వరకు అందరికీ తెలుసన్నారు. ఉమ్మడి జిల్లాలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం, అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. సన్యాసి జూపల్లి కృష్ణారావు, దగుల్బాజి గువ్వల బాలరాజు ఇద్దరూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు పట్టిన చీడ పురుగులని మంత్రి, ఎమ్మెల్యే పై రేవంత్‌ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు విమర్శించారు. రైతుబంధు పథకం పేరుతో మరోసారి ఓటర్లను మభ్యపెడుతున్న కెేసీఆర్‌.. రైతు బతికున్నప్పుడు ఆదుకోకుండా.. చనిపోయాక రూ.ఐదు లక్షలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రగతిభవన్‌ను చుట్టుముడతారనే భయంతోనే ఆందోళనాకారులను ఎక్కడికక్కడ పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని విమర్శిం చారు. మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, జిల్లాలో ఇసుక వ్యాపారం చేస్తున్న ఎమ్మెల్యేల భరతం పడతామని హెచ్చరించారు.